Michelin: మిషిలిన్‌ కీలక పదవికి గగన్‌జోత్‌ సింగ్‌..!

ప్రముఖ టైర్ల తయారీ సంస్థ మిషిలిన్‌లో భారత మూలాలు ఉన్న గగన్‌జోత్‌ సింగ్‌ కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను కంపెనీ ఆఫ్రికా, భారత్‌, మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతాల వ్యాపారాలకు అధ్యక్షుడిగా నియమించారు.

Published : 06 Jul 2021 17:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ మిషిలిన్‌లో భారత మూలాలు ఉన్న గగన్‌జోత్‌ సింగ్‌ కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన కంపెనీ ఆఫ్రికా, భారత్‌, మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతాల వ్యాపారాలకు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహించిన మార్క్‌ పస్క్యూట్‌ను కంపెనీ మరో చోట నియమించింది. దాదాపు పదేళ్ల నుంచి మిషిలిన్‌లో పనిచేస్తున్న గగన్‌జోత్‌ వివిధ విభాగాలకు నాయకత్వం వహించారు. ఆసియా, ఐరోపా, యూరప్‌ల్లో వివిధ వాణిజ్య కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఆయనకు గ్లోబల్‌ బిజినెస్ మోడల్‌ అధిపతిగా పనిచేసిన అనుభవం ఉంది.

2016-19 వరకు దక్షిణాఫ్రికా కస్టమ్స్‌ యూనియన్‌కు గగన్‌జోత్‌ ఎండీగా పనిచేశారు. 2012లో ఆయన తొలిసారి మిషిలిన్‌ భారత్‌ విభాగంలో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా చేరారు. అంతకు ముందు ఆయన గ్లాక్సో స్మిత్‌క్లెయిన్‌, పెప్సికోల్లో పనిచేశారు. ఆ తర్వాత సెయింట్‌ గోబియన్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో ఉద్యోగం చేసి ఆ తర్వాత మిషిలిన్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని