LinkedIn: చైనాలో నిలిచిపోనున్న లింక్డిన్ సేవలు.. ఎందుకంటే?
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని లింక్డిన్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో లింక్డిన్ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు తెలిపింది...
బీజింగ్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని లింక్డిన్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో లింక్డిన్ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. టెక్ సంస్థలపై అక్కడి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో లింక్డిన్ నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని పేర్కొంది. ప్రత్యేకంగా ఉద్యోగుల కోసమే రూపొందించిన లింక్డిన్ సేవల్ని నిలిపివేయడం వల్ల ఆ వర్గం ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేలా ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నట్లు పేర్కొంది. అయితే, దీంట్లో నెట్‌వర్కింగ్ ఫీచర్లు మాత్రం ఉండబోవని సంస్థ ఇంజినీరింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మొహక్ ష్రాఫ్ తెలిపారు.
2014లో చైనాలో కార్యకలాపాల్ని ప్రారంభించిన లింక్డిన్‌కు ఇటీవల చైనా ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. లింక్డిన్‌లో సమాచారాన్ని మరింత నియంత్రించాలని అక్కడి సర్కార్ ఓ డెడ్‌లైన్ కూడా విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లింక్డిన్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్