ఇంట‌ర్నెట్ లేకుండానే మొబైల్ బ్యాంకింగ్

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా ఆధునిక సాంకేతిక‌త వేగంగా విస్త‌రిస్తోంది. అయిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అనుకున్నంత స్థాయిలో ఇంట‌ర్నెట్ స‌దుపాయాలు విస్త‌రించ‌డం లేదు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఇంట‌ర్నెట్ వినియోగించేందుకు అవ‌కాశం ఉండ‌ట్లేదు.  ఈ నేప‌థ్యంలో నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా..

Published : 16 Dec 2020 15:13 IST

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా ఆధునిక సాంకేతిక‌త వేగంగా విస్త‌రిస్తోంది. అయిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అనుకున్నంత స్థాయిలో ఇంట‌ర్నెట్ స‌దుపాయాలు విస్త‌రించ‌డం లేదు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఇంట‌ర్నెట్ వినియోగించేందుకు అవ‌కాశం ఉండ‌ట్లేదు.  ఈ నేప‌థ్యంలో నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వారు కొత్త విధానాన్ని రూపొందించారు.  దీని ద్వారా ఇంట‌ర్నెట్ లేని సాధార‌ణ ఫోన్ల‌లో సైతం మొబైల్ బ్యాంకింగ్‌లో ఉండే స‌దుపాయాలు అందుబాటులో ఉంటాయి.  అయితే ఈ స‌దుపాయం పొందే ముందుగా బ్యాంకు ఖాతా ఉన్న చోట మొబైల్ నంబ‌రును న‌మోదు చేసుకుని ఉండాలి.

ఈ సేవ‌లు మూడు విధాలుగా ఉంటాయి.

  • ఆర్థికేత‌ర
  • ఆర్థిక‌
  • విలువ ఆధారిత సేవ‌లు

సేవ‌ల‌ను పొందేందుకు

  • మొబైల్‌లో *99# ను నొక్కాలి
  • ఈ ద‌శ‌లో ఐఎప్ఎస్‌సీ కోడ్‌ను న‌మోదు చేయాలి.
      త‌ర్వాత మొబైల్ తెర‌పై కింది ఆప్ష‌న్లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.

న‌గ‌దు విచార‌ణ : ఖాతాలో ఉన్న న‌గ‌దును తెలుసుకోవ‌చ్చు.
మినీ స్టేట్‌మెంట్ : చివ‌రి నాలుగు లావాదేవీల‌ను తెలుసుకోవ‌చ్చు.
ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ - ఎమ్ఎమ్ఐడీ : ఖాతాలోని న‌గ‌దును బ‌దిలీ చేయ‌వ‌చ్చు. ఇందుకోసం ఎమ్ఎమ్ఐడీ అవ‌స‌ర‌మ‌వుతుంది.
ఫండ్ ట్ర‌న్స్‌ఫ‌ర్‌- ఖాతా సంఖ్య‌ : ఖాతా సంఖ్య‌, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ద్వారా న‌గ‌దు బ‌దిలీ చేయ‌వ‌చ్చు.
ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్- ఆధార్ : ఖాతా సంఖ్య నుంచి మ‌రో వ్య‌క్తి ఆధార్ సంఖ్య‌కు న‌గ‌దును పంప‌వ‌చ్చు.
ఎమ్ఎమ్ఐడీ : ఖాతాకు సంబంధించిన ఎమ్ఎమ్ఐడీని తెలుసుకోవ‌చ్చు.
ఎమ్‌పిన్‌ : ఈ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను అడుగుతుంది.
 వివ‌రాల‌ న‌మోదు త‌ర్వాత వివిధ సేవ‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.
 ఎమ్‌పిన్ కోసం జ‌న‌రేట్ ఎమ్‌పిన్‌ను ఎంచుకోవాలి.
ఇందుకోసం కార్డు నంబ‌రు, సీవీవీ వివ‌రాలు న‌మోదు చేయాలి.
ఓటీపీ : దీన్ని ఎంచుకోవ‌డం  ద్వారా ఓటీపీని తెలుసుకోవ‌చ్చు.

ఆధార్ అనుసంధానం

  • మొబైల్ లో * 99 * 99 # ను నొక్కాలి.
  • 12 అంకెల ఆధార్ నంబ‌రును న‌మోదు చేయాల్సిందిగా అడుగుతుంది.
  • ఆధార్ నంబ‌రు న‌మోదు త‌ర్వాత క‌న్‌ఫ‌ర్మ్ చేయాల్సిందిగా 1 ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.
  • 1 నొక్కితే ఆధార్ అనుసంధానం పూర్త‌వుతుంది.

*99# సేవ‌ల ప్ర‌త్యేక‌త‌లు

  • ఇంట‌ర్నెట్ లేకుండానే ఈ సేవ‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు.
  • సెల‌వు రోజుల్లో సైతం ఈ సేవ‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు.
  • ఏ మొబైల్‌లోనైనా, ఏ టెలికాం నెట్‌వ‌ర్క్‌లోనైనా ఒకే త‌ర‌హా ప‌నితీరు ఉంటుంది.
  • ఆధార్ అనుసంధానం అయిందా లేదా దీని ద్వారా తెలుసుకోవ‌చ్చు.

దేశంలో 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నా 75 శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు లేవు. ఇలాంటి వారికి ఎన్‌పీసీఐ రూపొందించిన ఇంట‌ర్నెట్ లేకుండానే మొబైల్ బ్యాంకింగ్ విధానం ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుంది. మ‌రో వైపు బ్యాంకుల‌కు సైతం ఖ‌ర్చు త‌క్కువవుతుంది. స‌మ‌యం ఆదా అవ‌డంతో పాటు బ్యాంకు, ఏటీఎమ్‌ల‌కు వెళ్లాల్సిన శ్ర‌మ త‌గ్గుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని