నెల‌వారిగా ఆదాయాన్నిచ్చే 5 ప‌థ‌కాలు

ఉద్యోగం చేసేట‌ప్పుడు నెల‌వారిగా ఆదాయం ల‌భిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. మ‌రి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా అదేవిధంగా నెల‌వారిగా ఆదాయం పొంద‌గ‌లిగితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు.....

Published : 19 Dec 2020 11:26 IST

యాన్యుటీ లేదా పెన్ష‌న్ ప్లాన్‌ల ద్వారా నెల‌వారిగా పెన్ష‌న్‌ పొంద‌వ‌చ్చు

ఉద్యోగం చేసేట‌ప్పుడు నెల‌వారిగా ఆదాయం ల‌భిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. మ‌రి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా అదేవిధంగా నెల‌వారిగా ఆదాయం పొంద‌గ‌లిగితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. మ‌రి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా రెగ్యుల‌ర్‌గా ఆదాయం లేదా పెన్ష‌న్ పొందాలంటే ఇప్ప‌టినుంచే దాని గురించి ఆలోచించాలి. ఏ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు పెడితే నెల‌వారిగా ఆదాయం పొంద‌వ‌చ్చు.

  1. ఫిక్స్‌డ్ డిపాజిట్లు

దేశంలో ప్ర‌జ‌లు డ‌బ్బును సుర‌క్షితంగా దాచుకునేందుకు పాత ప‌ద్ద‌తిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కే ప్రాధాన్య‌త ఇస్తారు. ఎఫ్‌డీ పెట్టుబ‌డుల‌తో నెల‌వారిగా ఆదాయం రాదు, త్రైమాసికానికి ఒక‌సారి అది ఎఫ్‌డీ ఖాతాలోనే జ‌మ‌వుతుంది. అయితే మీరు నెల‌వారిగా ఆదాయం పొందాల‌నుకుంటే ఏడాది వ‌ర‌కు నెల‌కు కొంత క‌చ్చిత‌మైన డ‌బ్బును డిపాజిట్ చేయాలి. మొద‌టి 12 నెల‌ల‌కు డ‌బ్బు క్యాపిట‌ల్ రూపంలో ఉంటుంది. నెల‌కు ఒక‌సారి వ‌డ్డీ తీసుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు సంవ‌త్స‌రం పాటు నెల‌కు రూ.లక్ష‌ ఎఫ్‌డీలో డిపాజిట్ చేస్తే 7 శాతం వ‌డ్డీని లెక్కిస్తే త్రైమాసికానికి ఒక‌సారి వ‌డ్డీ తిరిగి లెక్కిస్తారు. 13 వ నెల నుంచి మీకు రూ.1,07,185 ల‌భిస్తుంది. మెచ్యూరిటీ మొత్తం నుంచి ల‌క్ష రూపాయ‌ల్ని తిరిగి డిపాజిట్ చేయాలి. వ‌డ్డీ రూ.7,186 మీకు ల‌భిస్తుంది. ఈ వ‌డ్డీ ఆదాయం ప్రతి నెలా ఇలాగే కొన‌సాగుతుంది. అయితే ఈ ప్లాన్‌లో అనుకూలం కంటే ప్ర‌తికూల అంశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పుకోవ‌చ్చు. ఒకవేళ వ‌డ్డీ రేట్లు త‌గ్గితే మీ ఆదాయం త‌గ్గ‌వ‌చ్చు.

అయితే సీనియ‌ర్ సిటిజ‌న్లు ప‌దేళ్ల‌పెట్టుబ‌డుల ప్లాన్ వ‌య వంద‌న యోజ‌న‌తో మంచి ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. ఇందులో నెల‌కు, మూడు నెల‌ల‌కు, ఆరు నెల‌ల‌కు వ‌డ్డీ తీసుకునేలా కావ‌ల‌సిన ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు. వ‌డ్డీ రేటు వార్షికంగా 8.3 శాతంగా ఉంటుంది నెల‌కు అయితే 8 శాతంతో స‌మానం. గ‌రిష్ఠ పెట్టుబ‌డి రూ.15 ల‌క్ష‌లు ఉంటుంది సీనియ‌ర్ సిటిజ‌న్‌కు నెల‌కు రూ.10 వేలు ల‌భిస్తాయి.

  1. నెలవారి ఆదాయ ప‌థ‌కాలు

నెల‌వారి ఆదాయ ప‌థ‌కాలు పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉంటాయి. దీనిపై ప్ర‌స్తుతం 7.6 శాతం వ‌డ్డీ ల‌భిస్తోంది. నెల‌కు ఒక‌సారి ఈ వ‌డ్డీని అందిస్తారు. గ‌రిష్ఠ పెట్టుబ‌డిప‌రిమితి రూ.4.5 ల‌క్ష‌లు ఉంటుంది. ఉమ్మ‌డి ఖాతాకు అయితే రూ.9 ల‌క్ష‌లు. ఉమ్మ‌డి ఖాతాపై నెల‌కు రూ.5,300 వ‌డ్డీ ల‌భిస్తుంది. 10 ఏళ్ల మైనర్ పేరుతో కూడా ఖ‌తాను ప్రారంభించ‌వ‌చ్చు. అయితే పెట్టుబ‌డుల‌పై ప‌రిమితి ఉంటుంది. కొన్ని డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు ఈ స్కీముల‌ను అందిస్తాయి. వీటిపై రాబ‌డి మార్కెట్ రిస్క్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

  1. బీమా యాన్యుటీ ప్లాన్‌లు

యాన్యుటీ లేదా పెన్ష‌న్ ప్లాన్‌లు జీవిత కాలం నెల‌వారిగా పెన్ష‌న్‌ను అందిస్తాయి. ప్లాన్‌లు ఎల్ఐసీ జీవ‌న్ అక్ష‌య్ అండ్ జీవ‌న్ శాంతీ మాదిరిగా త‌క్ష‌ణ యాన్యుటీలు లేదా డిఫ‌ర్డ్ యాన్యుటీ అంటే కొంత కాలం త‌ర్వాత పెన్ష‌న్ పొంద‌డం వంటివి. ఇక్క‌డ అనుకూల అంశం ఏంటంటే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కే కాకండా 30 ఏళ్లు పైబ‌డిన వారికి కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. సొంతంగా పెన్ష‌న్ పొందేందుకు లేదా భార్య‌కు లేదా భ‌ర్త‌కు నామినీ పాల‌సీ డ‌బ్బు తిరిగి పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. నెల‌వారి పెన్ష‌న్ పాల‌సీదారుడి వ‌య‌సు, ఇత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

  1. మ్యూచువ‌ల్ ఫండ్ డివిడెండ్లు

చాలా వ‌ర‌కు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల ఈక్విటీ, డెట్ ప‌థ‌కాలు డివిడెండ్ల‌ను చెల్లిస్తాయి. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.10 లక్ష‌ల వ‌ర‌కు డివిడెండ‌పై ఎటువంటి ప‌న్ను ఉండ‌దు. అయితే డివిడెండ్లు రెగ్యుల‌ర్‌గా వ‌స్తాయా లేదా అన్న‌ది కచ్చితంగా చెప్ప‌లేం. ఫండ్ నిక‌ర ఆస్తి విలువ త‌గ్గితే తిరిగి రిక‌వ‌ర్ అయ్యేంత వ‌ర‌కు డివిడెండు చెల్లింపుపై న‌మ్మ‌కం ఉండ‌దు.

  1. మ్యూచువ‌ల్ ఫండ్ క్ర‌మానుగ‌త ఉప‌సంహ‌ర‌ణ ప్లాన్‌లు

కొన్ని సంవ‌త్స‌రాలు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన త‌ర్వాత కాలానుగుణంగా పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు గాను ఈ ప‌థ‌కాన్ని ఎంద‌చుకోవ‌చ్చు. ప్ర‌తి నెల‌లో క‌చ్చితంగా కొంత‌ డ‌బ్బును తీసుకునే విధంగా ఈ ప్లాన్ ఉంటుంది. నిక‌ర ఆస్తుల విలువ త‌గ్గినా పెరిగినా దీనిపై ప్ర‌భావం ఉండ‌దు. అయితే ఫండ్ విలువ‌ త‌గ్గిన‌ప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు అమ్మ‌వ‌ల‌సి ఉంటుంది. అప్పుడు క్యాపిట‌ల్ మీద ప్ర‌భావం ప‌డుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని