మోతీలాల్ ఓస్వాల్ ఎస్&పీ 500 ఇండెక్స్ ఫండ్‌లో స‌బ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారా?

ఈ ఫండ్ హౌస్ నుంచి యూఎస్ స్టాక్ ఎక్స్చేంజి ని అనుసరిస్తూ వస్తున్న రెండవ స్కీం ఇది....

Published : 22 Dec 2020 17:20 IST

ఈ ఫండ్ హౌస్ నుంచి యూఎస్ స్టాక్ ఎక్స్చేంజి ని అనుసరిస్తూ వస్తున్న రెండవ స్కీం ఇది

భారతీయ మదుపరులకు , యూఎస్ లో ప్రధాన ఇండెక్స్ ఎస్&పీ 500 లో మదుపు చేసే అవకాశం. యూఎస్ ఎక్స్చేంజ్‌లలో నమోదైన అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ గల 80శాతం స్టాక్స్ ఎస్&పీ 500 ఇండెక్స్ లో ఉన్నాయి . భారతీయ వినియోగదారులకు పరిచయమైన అమెజాన్ , కోకా కోలా , మాక్ డోనాల్డ్, నైక్, స్టార్ బక్స్ కాఫీ వంటి పెద్ద కంపెనీలు ఎస్&పీ 500 ఇండెక్స్ లో ఉన్నాయి . మోతిలాల్ ఓస్వాల్ అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ ప్రవేశ పెట్టే ఇండెక్స్ ఫండ్ ఎస్&పీ 500 ఇండెక్స్ ను అనుసరిస్తుంది .

ఈ ఫండ్ హౌస్ నుంచి యూఎస్ స్టాక్ ఎక్స్చేంజి ని అనుసరిస్తూ వస్తున్న రెండవ స్కీం ఇది. మార్చి 2011లో యూఎస్ స్టాక్‌ ఎక్స్చేంజి నాస్ డాక్ ని అనుసరిస్తూ పనిచేసే ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ ను ప్రవేశ పెట్టింది .

మోతిలాల్ ఓస్వాల్ ఎస్&పీ 500 ఇండెక్స్ ఫండ్ ఏప్రిల్ 15నుంచి 23 వరకు ముఖ విలువకు అందుబాటులో ఉంటుంది .ఇది ఓపెన్ ఎండెడ్ స్కీం కాబట్టి, ఆ తరువాత కూడా మదుపరులకు అందుబాటులో వుంటుంది .

ఇండియా లో నిఫ్టీ 50 లాగానే యూఎస్ లో ఎస్& పీ 500 కూడా ఒక డైవర్సిఫైడ్ ఇండెక్స్. ఇండియాలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లో కేవలం 67 శాతం మాత్రమే నిఫ్టీ 50 లోఉన్నాయి . అదే నిఫ్టీ 100 లో 77 శాతం. అయితే ఎస్&పీ 500 లో యూ ఎస్ లో నమోదైన అత్యధిక మార్కెట్ కాపిటిజేషన్ గల 80 శాతం కంపెనీలు ఉన్నాయి

ఫండ్ అతిపెద్ద రంగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ఇండెక్స్‌లో 24.4% వాటాను కలిగి ఉంది. దీని తరువాత ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక , సమాచార మార్పిడి విభాగాలు ఉన్నాయి. ఇక‌ నిఫ్టీ 100 లో ఆర్థిక రంగం అధికంగా 36 శాతం వాటా ఉంది.
బరువు ఎస్&పీ 500 ఇండెక్స్ యూ ఎస్ లోని 11 సెక్టార్ లను పరిగణిస్తే, నాస్ డాక్ కేవలం 8 సెక్టార్ లను పరిగణనలోకి తీసుకుంది. యూ ఎస్ లో మూడవ అతిపెద్ద ఇండెక్స్ డౌ జోన్స్ కేవలం 30 స్టాక్స్ ను పరిగణనలోకి తీసుకుంది (రవాణా,వినియోగాలు తప్ప ).

19 మార్చి 2020 నాటికి ఎస్&పి 500 ఇండెక్స్ , రూపాయి మారకంలో రాబడి (CAGR పద్ధతిలో) 12.7%( 5ఏళ్లు); 17.8% (10 ఏళ్లు) గా వుంది . అయితే ఇదే కాలానికి నిఫ్టీ 50 రాబడి (CAGR పద్ధతిలో) 6.3%( 5 ఏళ్లు); 9.6% (10ఏళ్లు) గా వుంది . నిఫ్టీ 100 రాబడి కూడా నిఫ్టీ 50 లనే వచ్చింది.

అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రకారం ఫండ్ నిర్వహణ ఖర్చులు రెగ్యులర్ ప్లాన్ లకు 1 శాతం గాను, డైరెక్ట్ ప్లాన్ లకు 0.50శాతం గాను ఉంటుందని తెలిపింది . కనీస మదుపు రూ. 500. దీని రాబడి ఎస్&పీ 500 ను అనుకరిస్తుంది, అందువలన వీటి నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ. మోతిలాల్ ఓస్వాల్ ఎస్&పీ 500 ఇండెక్స్ ఫండ్ యుఎస్ డాలర్ లలో మదుపు చేస్తున్నప్పటికీ , రూపాయలలో మదుపు చేసేందుకు అందుబాటులో వుంటుంది . రూపాయి -డాలర్ మారకంలో వచ్చే మార్పుల ప్రభావం వుంటుంది . రూపాయి పతనం వలన మదుపరికి ప్రయోజనం.

పన్ను:
డెట్ ఆధారిత పన్ను వర్తిస్తుంది . 3ఏళ్లలోపు విక్రయిస్తే , ఆదాయానికి జోడించి పన్ను లెక్కించాల్సి ఉంటుంది. 3 ఏళ్ల తరువాత విక్రయిస్తే 20% ఇండెక్సషన్ ప్రయోజనం పొందొచ్చు.

ఈ ఫండ్ లో మదుపు చేసేందుకు ఉద్దేశ్యాలు :
ఎస్&పీ 500 ఇండెక్స్ ఫండ్ రాబడి యూ ఎస్ డాలర్ లలో ఉంటుంది, రూపాయి పతనం వలన లాభపడవచ్చు. మార్చి 1999 నుంచి మార్చి 2020 లో ఎస్&పీ 500 డాలర్ విలువ తో 4.9 రెట్లు పెరిగితే, అదే రూపాయి విలువతో 8.6 రెట్లు పెరిగింది. ఎస్&పీ 500 యూఎస్ ఇండెక్స్ అయినప్పటికీ, అందులోని కంపెనీల అమ్మకాలలో 40 శాతం వాటా ప్రపంచ దేశాల నుంచి అందుతోంది . ప్రస్తుతం యూఎస్ మార్కెట్ కంటే ఇండియా మార్కెట్ చాలా చౌకగా ఉన్నాయి . అయితే యూఎస్ మార్కెట్ ల కున్న అవకాశాలు మన మార్కెట్ లకు లేవు.

ఎస్&పీ 500 ఇండెక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం వరకు (యూ ఎస్ మార్కెట్ కాక) ఆదాయం లభిస్తోంది కాబట్టి , ఇదొక మంచి అవకాశం. పోర్ట్ఫోలియో లో 10 శాతం వరకు కేటాయించవచ్చు. అయితే ఒకేసారి కాకుండా విడతలలో చేయొచ్చు. ఎందుకంటే ప్రపంచ మార్కెట్ లు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

ఇప్పటివరకు అంతర్జాతీయ ఫండ్ లలో మదుపు చేయకపోతే, ఇదొక మంచి డైవర్సిఫైడ్ ఫండ్ గా మొదలుచేయొచ్చు. ఇదివరకే మదుపు చేసినట్లయితే, ఇది మరొక మంచి అవకాశంగా భావించవచ్చని ఫిరోజ్ అజీజ్ , వైస్ ప్రెసిడెంట్ , ఆనంద్ రాఠీ వెల్త్ మానెజ్మెంట్ తెలిపారు. అలాగే కోవిడ్‌- 19 కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు కుదేలవుతున్న తరుణంలో ఆచితూచి మదుపు చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని