నెల‌కు ₹2.5 ల‌క్ష‌లు రావాలంటే...

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ప్రతి నెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలికంగా పెద్ద మొత్తం సంపాదించడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) సహాయపడుతుంది.

Updated : 21 Jul 2021 17:51 IST

నెల‌కు ఎంత సిప్ చేయాలి?

ఇంటర్నెట్‌ డెస్క్: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ప్రతి నెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలికంగా పెద్ద మొత్తం సంపాదించడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) సహాయపడుతుంది. ద్రవ్యోల్బణ రేటును దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి విషయంలో నిర్ణ‌యం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. సంపాదించే వ్యక్తి పదవీ విరమణానంతర జీవితం కోసం 30 ఏళ్ల వయసులో ఆదా చేయడం ప్రారంభించాలి. కానీ, ఈ వయసులో కెరీర్ ఇంకా ప్రారంభ దశలో ఉంంటుంది. కాబట్టి, పెట్టుబడి కోసం ఒకేసారి పెద్ద మొత్తం అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు, సిప్‌ను ప్రారంభించాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. 

ఉదాహరణకు... 

* మధ్యతరగతి కుటుంబంలో పదవీ విరమణ తర్వాత ఒక‌ వ్యక్తికి నెలకు సుమారు ₹40,000 అవసరం. ద్రవ్యోల్బణ వృద్ధిని సంవత్సరానికి 6 శాతం నుంచి 6.5 శాతంగా అంచ‌నా వేస్తే, 30 ఏళ్ల తరవాత ఆ ఖ‌ర్చు సుమారు ₹2.5 లక్షల అవ్వొచ్చని అంచనా.

* 60 ఏళ్లప్పుడు నెల‌కు ₹2.5 ల‌క్ష‌ల ఆదాయం రావాలంటే ఆ వ్య‌క్తికి  ₹ 5 కోట్లు అవ‌స‌రం. పెట్టుబడిదారుడు 30 సంవత్సరాల వయసులో మ్యూచువల్ ఫండ్ సిప్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించి, 30 సంవత్సరాలు కొన‌సాగిస్తే ₹5 కోట్ల కార్పస్‌ ఏర్పడుతుంది.

* రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని... మ్యూచువల్ ఫండ్ సిప్ రాబ‌డి 8 శాతం ఉంటుంది అనుకుంటే లెక్క వేరే ఉంటుంది. 30 సంవ‌త్స‌రాల వ‌య‌సులో సిప్‌ ప్రారంభిస్తే...  30 ఏళ్లపాటు నెల‌కు ₹11,000 సిప్‌లో పెట్టుబ‌డి పెట్టాలి. ఆ త‌ర్వాత సంవ‌త్స‌రానికి 10 శాతం చొప్పున సిప్‌ను పెంచుతూ పోవాలి.

* ₹5 కోట్ల‌తో నెల‌కు ₹2.5 ల‌క్ష‌లు ఎలా వ‌స్తాయంటే... 60 ఏళ్ల వ‌య‌సులో ఆ సిప్ మొత్తం ₹5 కోట్ల‌ను తీసి, వ‌చ్చే 20 ఏళ్ల కోసం సిస్ట‌మేటిక్ విత్‌ డ్రాయ‌ల్ ప‌థ‌కంలో (ఎస్‌డ‌బ్ల్యూపీ) ఒకేసారి డిపాజిట్ చేయాలి. ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేస్తే... పదవీ విరమణ అనంతరం ఎస్‌డ‌బ్ల్యూపీపై 4 శాతం వార్షిక ఉపసంహరణను ఉపయోగించి, 8 శాతం రాబ‌డి తిరిగి వస్తుందని అంచ‌నా వేయాలి. అలా నెల‌కు ₹2.5 ల‌క్ష‌లు పొంద‌గ‌లుగుతారు. 

గమనిక: సిప్‌ తీసుకునే ముందు ద్రవ్యోల్బణ రేటును దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సంబంధిత పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాలని సూచిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని