EV charging Centres: రహదారుల వెంట ఛార్జింగ్‌ కేంద్రాలు

జాతీయ రహదారుల వెంట ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)’ విద్యుత్తు వాహనాల కోసం ఛార్జింగ్‌ వసతులు ఏర్పాటు చేస్తోందని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు...

Published : 01 Oct 2021 23:49 IST

వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

దిల్లీ: విద్యుత్తు వాహనాల కోసం జాతీయ రహదారుల వెంట ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)’ ఛార్జింగ్‌ వసతులు ఏర్పాటు చేస్తోందని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. విద్యుత్తు వాహన వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే కొవిడ్‌-19 వల్ల దేశీయ వాహన రంగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. భారతదేశ జీడీపీలో వాహన రంగానిది 7.1 శాతం వాటా ఉందని తెలిపారు. ఉత్పత్తి రంగ జీడీపీలో 49 శాతం వాటా వాహన రంగానిదేనని వెల్లడించారు. అలాగే అంతర్జాతీయ స్థాయి వాహన తయారీ సంస్థలు భారత్‌లోకి ప్రవేశిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. విద్యుత్తు వాహనాలను భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు దేశీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఓ నివేదిక ప్రకారంలో జులైలో విద్యుత్తు ద్విచక్రవాహనాల విక్రయాలు 13,345 యూనిట్లుగా నమోదైనట్లు గడ్కరీ తెలిపారు. నెలవారీ ప్రాతిపదికన విద్యుత్తు వాహన విక్రయాల్లో 229 శాతం.. ఏడాది ప్రాతిపదికన 836 శాతం వృద్ధి కనపడిందని పేర్కొన్నారు. అంకుర సంస్థలు తీసుకొస్తున్న విద్యుత్తు స్కూటర్లకు దేశీయంగా మంచి గిరాకీ ఉందన్నారు. అయితే, తక్కువ ధర, ఎక్కువ మన్నిక, అధిక సామర్థ్యంతో పనిచేసే బ్యాటరీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే.. స్వచ్ఛ ఇంధన వాహనాల వినియోగం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని