ఎన్‌హెచ్‌పీసీ లాభం రూ.464 కోట్లు

ప్రభుత్వ రంగ జల విద్యుత్‌ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.464.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదే త్రైమాసికంలో సంస్థ నమోదు చేసిన రూ.258.83 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 80 శాతం అధికం.

Published : 11 Jun 2021 02:15 IST

ఒక్కో షేరుకు 35 పైసల తుది డివిడెండ్‌

దిల్లీ: ప్రభుత్వ రంగ జల విద్యుత్‌ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.464.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదే త్రైమాసికంలో సంస్థ నమోదు చేసిన రూ.258.83 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 80 శాతం అధికం. మొత్తం ఆదాయం మాత్రం రూ.2,382.36 కోట్ల నుంచి రూ.2,094.30 కోట్లకు తగ్గింది. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం రూ.3,582.13 కోట్లకు చేరింది. 2019-20లో ఇది రూ.3,344.91 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.10,776.64 కోట్ల నుంచి రూ.10,705.04 కోట్లకు తగ్గింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 3.5 శాతం చొప్పున (35 పైసలు) తుది డివిడెండ్‌ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చిలో చెల్లించిన రూ.1.25 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనమని కంపెనీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని