ఎఫ్‌డీ, లిక్విడ్ ఫండ్ల కంటే ఎక్కువ రాబ‌డినిచ్చే ఎన్‌పీఎస్ ఖాతా

గత మూడేళ్లలో, ఎన్‌పిఎస్ టైర్ II ఖాతా స్కీమ్ జి, వార్షిక రాబడి 9.53 శాతంగా ఉంది, గత ఐదేళ్లలో సగటు రాబడి 10.20 శాతంగా న‌మోదైంది........

Published : 25 Dec 2020 17:10 IST

గత మూడేళ్లలో, ఎన్‌పిఎస్ టైర్ II ఖాతా స్కీమ్ జి, వార్షిక రాబడి 9.53 శాతంగా ఉంది, గత ఐదేళ్లలో సగటు రాబడి 10.20 శాతంగా న‌మోదైంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) టైర్ II ఖాతా రాబ‌డి ఇత‌ర‌ స్థిర ఆదాయ పెట్టుబడులను అధిగమించింది. గత సంవత్సరంలో 11.11 శాతం రాబడితో, ఎన్‌పిఎస్ టైర్ II స్కీమ్ జి లిక్విడ్ డెట్‌ మ్యూచువల్ ఫండ్లు, బ్యాంకు పొదుపు డిపాజిట్ల కంటే ఎక్కువ లాభాన్నిచ్చింది. గత ఒక సంవత్సరంలో సగటున లిక్విడ్ ఫండ్లు 5 శాతం రాబ‌డిని ఇచ్చాయి. సేవింగ్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా 5 శాతానికి తగ్గాయి. 180 రోజుల నుంచి ఒక సంవత్సరం కన్నా తక్కువ ఉన్న ఎస్‌బీఐ ఎఫ్‌డిలు 4.4 శాతం పొందుతాయి. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కన్నా తక్కువ వరకు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లు 4.9 శాతం ఇస్తాయి.

గత మూడేళ్లలో, ఎన్‌పిఎస్ టైర్ II ఖాతా స్కీమ్ జి, వార్షిక రాబడి 9.53 శాతంగా ఉంది, గత ఐదేళ్లలో సగటు రాబడి 10.20 శాతంగా న‌మోదైంది. ఎన్‌పిఎస్ టైర్ II అకౌంట్ స్కీమ్ జి, ప్రభుత్వ బాండ్లు మరియు సంబంధిత సాధనాలలో పెట్టుబడులు పెడుతుంది. ఎన్‌పీఎస్‌ టైర్ II ఒక స్వచ్ఛంద ఖాతా. ఇప్పటికే ఉన్న ఎన్‌పీఎస్ టైర్ I ఖాతా ఉన్నవారు టైర్ II ఖాతాను తెరవగలరు. టైర్ II ఖాతాకు మీరు చేసిన విరాళాల కోసం సెక్షన్ 80 సి కింద మినహాయింపును క్లెయిమ్ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కానట్లయితే మీరు మీ అభీష్టానుసారం టైర్ II ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు, తిరిగి పొందవచ్చు.

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగి ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతాలో పెట్టుబ‌డి పెడితే సెక్ష‌న్ 80సీ కింద గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఇలాంటి ఖాతాల‌కు లాక్‌-ఇన్ పీరియ‌డ్ మూడేళ్లు ఉంటుంది.

ఎన్‌పీఎస్ టైర్‌-2 ఖాతాలోని పెట్టుబ‌డుల ప‌నితీరు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం

nps.png

ఎన్‌పీఎస్ టైర్‌-2 ఖాతాలో జీ స్కీమ్ కింద రూ.610 కోట్ల నిధుల‌ను నిర్వ‌హిస్తుంది. ఎన్‌పీఎస టైర్‌-2 ఖాతా ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు, ప్ర‌భుత్వం బాండ్లు, ఇత‌ర ప్ర‌త్యామ్నాయ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డుల‌ను కేటాయిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని