ఇప్పుడు ఐఎంపీఎస్‌తో కూడా ఎన్‌పీఎస్ పెట్టుబ‌డులు

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అందించే తక్షణ చెల్లింపు సౌకర్యం ఐఎంపీఎస్

Published : 12 Mar 2021 13:07 IST

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) డైరెక్ట్ రెమిటెన్స్ (డీ-రిమిట్) అని పిలిచే కొత్త చెల్లింపు విధానాన్ని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) చందాదారుల కోసం ప్రవేశపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్స్ కొత్త మోడ్, ఎన్పీఎస్ చందాదారునికి నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రమబద్ధమైన పెట్టుబడులను పెట్టడానికి వీలు కల్పిస్తుంది, దీని ద్వారా ఎన్‌పీఎస్‌లో క్రమానుగతంగా కాంట్రిబ్యూషన్స్ చేయవచ్చు. చందాదారుడి బ్యాంకు ఖాతాకి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా నేరుగా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. లావాదేవీలో ఎటువంటి చార్జీలు లేనందున డీ-రిమిట్ మోడ్‌లో ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ ఆన్‌లైన్ చెల్లింపు పూర్తిగా ఉచితం. 
డీ-రిమిట్ ఆప్షన్ నిధులను జమ చేసే ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా, చందాదారులకు డిపాజిట్ చేసిన తేదీన నికర ఆస్తి విలువ (ఎన్‌ఏవీ) ను అందించడం ద్వారా పెట్టుబడి రాబడిని ఆప్టిమైజ్ చేస్తుంది.

డైరెక్ట్ రెమిటెన్స్ సహాయంతో, ప్రభుత్వం, ప్రభుత్వేతర లేదా అన్ని పౌరుల మోడల్ కింద‌ ఉన్న ఎన్‌పీఎస్ చందాదారులు వారి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యకు అనుసంధానించబడిన వర్చువల్ ఐడిని సృష్టించడం ద్వారా వారి స్వచ్ఛంద సహకారాన్ని జమ చేయవచ్చు.

అయితే ఎన్‌పీఎస్ చందాదారులు ఇప్పుడు తమ చెల్లింపులను డైరెక్ట్ రెమిటెన్స్ (డీ-రిమిట్) కింద తక్షణ చెల్లింపు వ్యవస్థ (ఐఎమ్‌పిఎస్) ద్వారా జమ చేయవచ్చు. ప్రస్తుతం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌) చందాదారులు తమ సహకారాన్ని డి-రిమిట్ కింద నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఉపయోగించి చేసేందుకే వీలుంది.

మార్చి 10 న జారీ చేసిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డీఏ) సర్క్యులర్ ప్ర‌కారం, ఐఎంపీఎస్‌ను అంగీకరించే కార్యాచరణ మార్చి 1, 2021 నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. అయితే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్‌లా అదేరోజు కాకుండా, ఐఎంపీఎస్ ద్వారా చేస్తే  త‌ర్వాత రోజు నుంచి T + 1  లెక్కించ‌బ‌డ‌తాయి. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్‌లో అయితే ఉద‌యం 9.30 గంటల వరకు అందుకున్న నిధులను అదే రోజు పెట్టుబడిగా పరిగణిస్తారు. ఉదయం 9.30 గంటల తరువాత వచ్చిన నిధులను మరుసటి రోజు, అంటే టీ + 1 రోజున పెట్టుబడి పెడతారు.

ఈ రోజు వరకు, ఎన్‌పీఎస్‌లోని వివిధ రంగాల్లోని చందాదారులు 1.48 లక్షల డి-రిమిట్ ఐడిలను సృష్టించారు, 2020 అక్టోబర్ 1 న కొత్త ఫీచర్‌ను ప్రారంభించినప్పటి నుంచి డి-రెమిట్ ఉపయోగించి 180 కోట్ల డిపాజిట్లు చేసినట్లు పీఎఫ్‌ఆర్‌డీఏ సర్క్యులర్ తెలిపింది.

వర్చువల్ ID లను రూపొందించడానికి మీకు సహాయపడే సీఆర్ఏ లింకులు:

https://cra-nsdl.com/CRAOnlineNirtualldCreation.html

https://enps.kfintech.com/dremit/prelogindremit/
డి-రెమిట్ ఎన్‌పీఎస్ చందాదారులకు చందాదారుల పొదుపు బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా సహకరించడానికి సహాయపడుతుంది. ఇది వారికి అదే రోజు పెట్టుబడి  ప్రయోజనాన్ని కూడా ఇస్తుంది, సెలవులు మినహా ఏదైనా బ్యాంకు పని రోజున ఉదయం 9.30 గంటలకు ముందు ట్రస్టీ బ్యాంక్ వద్ద విరాళాలు అందుతాయి.

ప్రభుత్వ, ప్రభుత్వేతర, అన్ని సిటిజన్ మోడల్ కింద చందాదారులకు డీ-రిమిట్ మోడ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ అందుబాటులో ఉంటుంది. డీ-రిమిట్ మోడ్ ద్వారా కాంట్రిబ్యూషన్స్ చేయడానికి, ఖాతాలోకి లాగిన్ అవ్వడం ద్వారా పర్మనెంట్ రెమిటెన్స్ అకౌంట్ నెంబర్ (పీఆర్ఏఎన్) తో అనుసంధానించిన వర్చువల్ ఐడీని క్రియేట్ చేయాలి. ఆ తరువాత, చందాదారుడు వారి నెట్ బ్యాంకింగ్ ఖాతాలో బెనిఫిషరీ గా ఐఎఫ్ఎస్సీ వివరాలతో పాటు వర్చువల్ ఐడీని జోడించాల్సి ఉంటుంది. చివరగా, చందాదారుడు అవసరమైనప్పుడు ఎన్‌పీఎస్ ఖాతాలోకి నిధులను బదిలీ చేయడం ప్రారంభించవచ్చు.

అంతేకాకుండా, మ్యూచువల్ ఫండ్లలో సిప్ మాదిరిగానే క్రమానుగతంగా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి నెట్ బ్యాంకింగ్‌లో ఆటో-డెబిట్‌ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

ప్రస్తుతం నోడల్ కార్యాలయాలు, పీఓపీలు, ఈ-ఎన్‌పీఎస్ లేదా ఎన్‌పీఎస్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే పెట్టుబడులు పెట్టాలి, కానీ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి అవసరమైన టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయాలని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు, బ్యాంకులను పీఎఫ్‌ఆర్‌డీఏ కోరింది. త్వరలో ఇది కూడా అమలులోకి వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని