NPS: 12 ఏళ్లలో ఎన్‌పీఎస్‌ ఎంత రాబడి ఇచ్చిందో తెలుసా?

దిల్లీ: పింఛను ఆధారిత మదుపు పథకం గత 12 ఏళ్లలో మంచి రాబడి ఇచ్చిందని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్మన్‌ సుప్రతిం బంధోపాధ్యాయ తెలిపారు. చిన్న వయసులో ప్రారంభిస్తే మరింత ఎక్కువ రాబడి ఉంటుందని తెలిపారు.

ఈక్విటీ ఆధారిత ఎన్‌పీఎస్‌ గత 12 ఏళ్లలో 12 శాతం రాబడి ఇవ్వగా.. ప్రభుత్వ సెక్యూరిటీలు 9.9 శాతం, కార్పొరేట్‌ బాండ్లు 9.59 శాతం రాబడినిచ్చాయని బంధోపాధ్యాయ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌ నిర్వహణలో రూ.6.85 లక్షల కోట్ల నిధులు ఉన్నాయన్నారు. భారత్‌లో పింఛను వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. బీమా నియంత్రణా సంస్థ ఐఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ,  పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందన్నారు. పీఎఫ్‌ఆర్‌డీఏ రెండు పింఛను పథకాలను అందిస్తోంది. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ చేరువ కాగా.. అసంఘటిత రంగంలోని వారికి అటల్‌ పెన్షన్‌ యోజన(ఏపీవై) అందుబాటులో ఉంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని