ఎన్‌పీఎస్ రాబ‌డిపై క‌చ్చిత‌మైన హామీ ఉంటుందా?

ఎన్‌పీఎస్ పెట్టుబ‌డులు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల వంటివే. రాబ‌డిని క‌చ్చితంగా అంచ‌నా వేయలేం.​​​​​​....​

Published : 19 Dec 2020 14:14 IST

ఎన్‌పీఎస్ పెట్టుబ‌డులు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల వంటివే. రాబ‌డిని క‌చ్చితంగా అంచ‌నా వేయలేం.

జాతీయ పించ‌ను పథ‌కంలో (ఎన్‌పీఎస్ ) పెట్టుబ‌డుల‌తో రాబ‌డిని ఆశిస్తున్నారా? ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల వంటివే. ఫండ్ నిక‌ర విలువ ఈక్విటీ లేదా డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల మాదిరిగానే ఒడొదుడుకుల‌కు లోన‌య్యే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎన్‌పీఎస్‌, మ్యూచువ‌ల్ ఫండ్లు వేర్వేరు అనుకుంటారు.

ఎన్‌పీఎస్‌లో డిపాజిట్ మొత్తం క‌లిపి వైవిధ్య‌త క‌లిగిన ఈక్విటీ, స్థిర ఆదాయ సెక్యూరిటీల‌లో ఆస్తుల నిర్వ‌హ‌ణ కంపెనీలు పెట్టుబ‌డులు పెడ‌తాయి. ఎస్‌బీఐ, యూటీఐ, ఎల్ఐసీ ప్ర‌భుత్వ ఉద్యోగుల పెట్టుబ‌డుల‌ను నిర్వ‌హిస్తాయి. అదేవిధంగా ఎస్‌బీఐ, యూటీఐ, ఐసీఐసీఐ, ఎల్ఐసీ, కోట‌క్‌, రిల‌య‌న్స్, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ‌లు కార్పొరేట్, వ్య‌క్తిగ‌త చందాదారుల లావాదేవీల‌ను చూసుకుంటాయి. స‌బ్‌స్క్రైబ్ చేసిన మొత్తం ఆధారంగా పెట్టుబ‌డుదారుల‌కు యూనిట్లను జారీచేస్తారు. ఎన్‌పీఎస్ ఫండ్ నిక‌ర ఆస్తి విలువ ఆధారంగా యూనిట్ల‌ను పంపిణీ చేస్తారు. మార్కెట్ల ఆధారంగా ఫండ్ విలువ మారుతుంటుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను సెబీ నియంత్ర‌ణ‌లో ఉన్న‌ట్లుగా, ఎన్‌పీఎస్‌- పీఎఫ్ఆర్‌డీఏ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. సెంట్ర‌ల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) ఎన్ఎస్‌డీఎల్‌ లావాదేవీల రికార్డుల‌ను ప‌రిశీలిస్తుంది. ఎన్‌పీఎస్‌లో పీఓపీ ద్వారా న‌మోదు చేసుకొని పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఇవి డిస్ర్టిబ్యూట‌ర్ల మాదిరిగా ప‌నిచేస్తాయి. పెట్టుబ‌డి మొత్తంలో 0.5 శాతం క‌మీష‌న్ తీసుకుంటాయి. అదేవిధంగా ఆన్‌లైన్ ద్వారా కూడా ఎన్‌పీఎస్‌లో సీఆర్ఏతో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అయితే ఎన్‌పీఎస్ ట్రాన్సాక్ష‌న ఛార్జీ ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు ఇది ఉండ‌దు. ఎన్‌పీఎస్‌కి యాక్సిస్ ట్రీస్టీ బ్యాంక్‌. చందాదారుల లావాదేవీల‌ను ఇది నిర్వ‌హిస్తుంది.

ఖాతాదారుడు డ‌బ్బును విత్‌డ్రా చేసిన‌ప్పుడు ట్ర‌స్టీ బ్యాంక్‌కి సీఆర్ఏ సూచ‌న‌లు చేస్తుంది. అందులో క‌నీసం 40 శాతం యాన్యుటీ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌కి, మిగ‌తాది చందాదారుడికి చేరేలా చేస్తుంది. యాన్యుటీ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌ల వంటివి.

ఎన్‌పీఎస్ పెట్టుబ‌డులు ఈక్విటీలు, ప్ర‌భుత్వ రంగ బాండ్లు, స్వ‌ల్ప‌కాలిక కార్పొరేట్ బాండ్లలో ఉంటాయి. అంటే ఎన్‌పీఎస్ రాబ‌డులు మార్కెట్లు , బాండ్ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌భుత్వ‌రంగ ఉద్యోగుల పోర్ట్‌ఫోలియోలు 15% ఈక్విటీల‌లో, 20% కార్పొరేట్ బాండ్ల‌లో ఉంటుంది. మిగ‌తాది దీర్ఘ‌కాలిక ప్రభుత్వ బాండ్ల‌లో ఉంటుంది. ఎన్‌పీఎస్ ప్ర‌భుత్వ అదీనంలో ఉంటుంది కాబ‌ట్టి రాబ‌డిపై న‌మ్మ‌కం ఉంటుంద‌ని చెప్పేందుకు వీలుండ‌దు. రిస్క్ ఉండ‌ద‌ని చెప్ప‌లేం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని