NPS: 70 ఏళ్ల వ‌య‌సులోనూ పెన్ష‌న్ స్కీమ్‌లో చేరొచ్చు.. 

సాధార‌ణంగా ఎన్‌పీఎస్ విత్‌డ్రా స‌మ‌యంలో స‌మ‌కూరిన కార్ప‌స్ నుంచి 40 శాతం మొత్తాన్ని యాన్యూటీల‌లో పెట్టుబ‌డి పెట్టాలి

Updated : 16 Jun 2021 12:45 IST


రూ. 5ల‌క్ష‌ల‌కు దిగువ‌న పెన్ష‌న్ కార్ప‌స్ ఉన్న చందాదారులు ఇక‌పై సేక‌రించిన మొత్తం కార్ప‌స్‌ను ఉపసంహ‌రించుకోవ‌చ్చు. యాన్యూటీల‌ను కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డీఏ) చందాదారులను అనుమతించింది.  ప్రస్తుతం, ప‌దవీ విర‌మ‌ణ స‌మ‌యంలో లేదా 60 ఏళ్లు నిండిన చందాదారులు పెన్ష‌న్ కార్ప‌స్ రూ. 2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ‌గా ఉంటే పెన్ష‌న్ మొత్తం 60 శాతం మాత్ర‌మే ఒకేసారి విత్‌డ్రా చేసుకునే వీలుంది. మిగిలిన 40 శాతం మొత్తంతో బీమా సంస్థ‌లు ఆఫ‌ర్ చేస్తున్న యాన్యూటీల‌ను క‌చ్చితంగా కొనుగోలు చేయాలి. 

అంతేకాకుండా, ఏక మొత్తంలో చేసే ఎన్‌పీఎస్ ముంద‌స్తు విత్‌డ్రాల ప‌రిమితి రూ.2.5 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు గెజెట్ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ఇందుకు ముందు ఇది రూ.1 ల‌క్ష మాత్ర‌మే ఉండేది. చందాదారుల శాశ్వ‌త రిటైర్‌మెంట్ అక్కౌంట్లో సేక‌రించిన పెన్ష‌న్ మొత్తం రూ.5 ల‌క్ష‌లు, అంత‌కంటే త‌క్కువ లేదా అధికారులు పేర్కొన్న ప‌రిమితి వ‌ర‌కు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే యాన్యూటీ కొనుగోలు చేయ‌న‌వ‌స‌రం లేకుండా చందాదారుడు సేక‌రించిన మొత్తాన్ని ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం ఉంటుంది. 

రెగ్యులేటర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ప్ర‌వేశ వయ‌స్సును కూడా గ‌రిష్టంగా 65 నుంచి 70 సంవత్స‌రాల‌కు పెంచింది.  నిష్క్రమణ వయోపరిమితిని 75 సంవత్సరాలకు పెంచారు. అంటే 70 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనూ ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని