ఎన్‌ఎస్‌సీ, ఎఫ్‌డీ.. పన్ను ఆదా చేయడానికి ఏది మేలు?

ఈ రెండు ఎంపికలు సాధారణంగా సీనియర్ సిటిజన్లకు సిఫార్సు చేస్తారు

Updated : 19 Mar 2021 17:03 IST

ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి చాలామంది పన్ను ఆదా చేసే ప‌థ‌కాల‌ కోసం చూస్తుంటారు. సెక్షన్ 80 సి కింద రూ. 1.5 లక్షల వరకు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి) , ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డి) ఉన్నాయి. రెండు ప‌థ‌కాల‌కు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది.  మ‌రి రెండింటిలో ఏది ఎన్నుకోవాలి

వడ్డీ రేటు:  ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటు బ్యాంకు నుంచి బ్యాంకుకు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ఇది 5.3 శాతం నుంచి 7 శాతం మధ్య ఉంటుంది, అయితే ఎన్‌ఎస్‌సీ 2021 మార్చి నుంచి ఈ త్రైమాసికంలో 6.8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంది. అయితే బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు బ్యాంక్ నిర్ణయిస్తాయి. బ్యాంక్ ఎఫ్‌డీల వడ్డీ రేట్లపై టీడీఎస్ వర్తిస్తుంది, అయితే ఎన్‌ఎస్‌సీపై టిడీఎస్ ఉండ‌దు. 

వడ్డీ తిరిగి పెట్టుబ‌డి: ఎన్‌ఎస్‌సీ, ట్యాక్స్ సేవింగ్‌ ఎఫ్‌డీ రెండింటిపై వ‌చ్చిన‌ వడ్డీపై పెట్టుబడిదారుడి చేతిలో పన్ను విధించబడుతుంది. ఎన్‌ఎస్‌సీ విషయంలో, సంపాదించిన వడ్డీ పెట్టుబడిదారుడికి చెల్లించకుండా, తిరిగి పెట్టుబడి పెట్టబడుతుంది. దీంతో రాబ‌డి మ‌రింత పెరుగుతుంది. దీంతో పాటు  వడ్డీ సెక్షన్ 80 సి కింద ప‌న్ను మినహాయింపు పొందుతుంది.

బ్యాంక్ ఎఫ్‌డీ విషయంలో, వడ్డీని కూడబెట్టుకోవడం, మెచ్యూరిటీపై చెల్లింపును స్వీకరించడం లేదా త్రైమాసికంగా తీసుకునే అవకాశం ఉంది. ఎఫ్‌డీలపై వడ్డీని సెక్షన్ 80 సి కింద మినహాయింపుగా క్లెయిమ్ చేయలేరు.

ఎన్‌ఎస్‌సీ, పన్ను-పొదుపు బ్యాంక్ ఎఫ్‌డీలు రెండూ ఒకే గ‌డువుతో, పెట్టుబడిపై ఎగువ పరిమితి లేకుండా ఉంటాయి. ఏదేమైనా, నిపుణులు సాధారణంగా ఎన్ఎస్‌సీ పెట్టుబ‌డుల‌ల‌ను సూచిస్తారు. ఎందుకంటే ఇది అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది.
 ఈ రెండు ఎంపికలు సాధారణంగా సీనియర్ సిటిజన్లకు సిఫార్సు చేస్తారు. ఎన్‌ఎస్‌సీకి అధిక వడ్డీ రేటు, సెక్షన్ 80 సి కింద వడ్డీ మినహాయింపు ప్రయోజనం ఉన్నందున  దానికి మొగ్గుచూపుతారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని