ఎన్‌పీసీఐకి ప్ర‌త్యామ్నాయంగా ఎన్‌యూఈ

 ఎన్‌పిసిఐకి ప్రత్యామ్నాయంగా సంస్థ‌లు ఎన్‌యూఈని ప్ర‌తిపాదించాయి

Updated : 03 Mar 2021 16:40 IST

డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్ నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ (ఎన్‌పీసీఐ)కి ప్ర‌త్యామ్నాయంగా న్యూ అంబ్రెల్లా ఎంటిటీ (ఎన్‌యూఈ) ఏర్పాటు చేయడానికి అవ‌స‌ర‌మైన‌ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అగ్ర బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. నివేదికల ప్రకారం, లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ , ఫేస్‌బుక్‌, గూగుల్, ఇన్ఫీబీమ్‌ల‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. మరిన్ని సంస్థ‌లు ఈ లైసెన్స్‌పై దృష్టి సారించాయి. పేటీఎం, ఓలా ఇండ‌స్‌ఇండ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. టాటా సన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లతో చేతులు కలిపింది. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో దరఖాస్తు చేసుకోవాలని అమెజాన్ యోచిస్తోంది.

ఎన్‌యూఈ లైసెన్స్ గురించి తెలుసుకోవలసిన  విషయాలు:
1. ప్రస్తుతం పెద్దగా పోటీ లేని ఎన్‌పీసీఐకు ప్రత్యామ్నాయంగా ఎన్‌యూఈ వైపు సంస్థ‌లు చూస్తున్నాయి. ఎన్‌పీసీఐ ఇతర విషయాలతోపాటు, యూపీఐ (ఏకీకృత చెల్లింపు ఇంటర్‌ఫేస్) ప్లాట్‌ఫామ్‌ను క‌లిగి ఉంది. మ‌రోవైపు  రూపే నెట్‌వర్క్‌ను కూడా నిర్వ‌హిస్తుంది.
 ఎన్‌యూఈ అందుబాటులోకి వ‌స్తే చెల్లింపులలో వేగవంతం చేస్తుంది, వినియోగదారులకు ఎన్‌పీసీఐకి ప్రత్యామ్నాయాలను ఇస్తుంది. ఏదేమైనా, కొత్త సంస్థలు అభివృద్ధి చేసే నెట్‌వర్క్, వ్యవస్థ ఎన్‌పీసీఐ  వ్యవస్థలతో అనుసంధాన‌మై ఉండాలి. 
2. లైసెన్స్ పొందిన వారు రిటైల్‌గా ఎటిఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్, చెల్లింపుల సేవలు, ఆధార్ ఆధారిత చెల్లింపులతో సహా కొత్త చెల్లింపు వ్యవస్థలను ఏర్పాటు చేయ‌వ‌చ్చు. ఇవి కొత్త చెల్లింపు పద్ధతులు, ప్రమాణాలు, సాంకేతికతలను కూడా క‌లిగి ఉంటాయి.
3. ఈ సంస్థ బ్యాంకుల కోసం క్లియరింగ్, సెటిల్‌మెంట్ వ్యవస్థలను కూడా నిర్వహిస్తుంది. దాని నెట్‌వర్క్‌లోని నష్టాలను గుర్తించడం.. దేశంలో, అంతర్జాతీయంగా రిటైల్ చెల్లింపు వ్యవస్థ అభివృద్ధి, సంబంధిత సమస్యలను పర్యవేక్షించే బాధ్యత నిర్వ‌హిస్తుంది. చెల్లింపు వ్యవస్థలను ప్రభావితం చేసే మోసాలను నివారించడానికి ఇది బాధ్యత వహిస్తుంది.
4. వ్యవస్థలు , నెట్‌వర్క్‌లు సురక్షితంగా ఉన్నాయని, చెల్లింపులు సమర్ధవంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని నిర్ధారించడానికి అవసరమైన నియమాలు, సంబంధిత ప్రక్రియలను ఇది రూపొందిస్తుంది.
5. ఈ కొత్త డిజిట‌ల్ చెల్లింపు వ్య‌వ‌స్థ‌ కస్టమర్ సౌలభ్యం, భద్రతను పెంచే వినూత్న చెల్లింపు వ్యవస్థలను అందిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని చెల్లింపు, పరిష్కార వ్యవస్థలలో పాల్గొనడానికి దీనిని అనుమతించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని