వచ్చే 7-8 ఏళ్లలో నాల్కో రూ.30,000 కోట్ల పెట్టుబడులు

వచ్చే 7-8 ఏళ్లలో ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో) విస్తరణ, వైవిధ్యీకరణలో (డైవర్సిఫికేషన్‌) భాగంగా రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు.

Updated : 08 Jan 2021 10:11 IST

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

దిల్లీ: వచ్చే 7-8 ఏళ్లలో ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో) విస్తరణ, వైవిధ్యీకరణలో (డైవర్సిఫికేషన్‌) భాగంగా రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా అల్యూమినా, అల్యూమినియంల ఉత్పత్తి, వినియోగం పెంచేలా నాల్కో విస్తరణ ప్రణాళికలు ఉంటాయని తెలిపారు. నాల్కో తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని ఒడిశాలోని (భువనేశ్వర్‌) నాల్కో ప్రధాన కార్యాలయంలో 41వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి వివరించారు. ప్రతిపాదిత పెట్టుబడి ప్రణాళికలో రూ.22,000 కోట్లు స్మెల్టర్‌, క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్‌ (సీపీపీ) విస్తరణ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. రూ.7,000 కోట్లతో అయిదో స్ట్రీమ్‌ రిఫైనరీని అభివృద్ధి చేయనుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని