వ్యాపారుల ఎన్‌పీఎస్‌కు స్పంద‌న క‌రువు

మార్చి నాటికి ప్రభుత్వం 50 లక్షల మందిని ఈ పథకంలో చేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు 25,000 మంది మాత్రమే మొగ్గుచూపారు....

Published : 21 Dec 2020 13:08 IST

మార్చి నాటికి ప్రభుత్వం 50 లక్షల మందిని ఈ పథకంలో చేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు 25,000 మంది మాత్రమే మొగ్గుచూపారు.

6 జనవరి 2020 మధ్యాహ్నం 12:03

వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం తీసుకొచ్చిన జాతీయ పింఛను పథకానికి (ఎన్‌పీఎస్‌) స్పందన క‌రువైంది. మార్చి నాటికి ప్రభుత్వం 50 లక్షల మందిని ఈ పథకంలో చేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకోగా… ఇప్పటి వరకు 25,000 మంది మాత్రమే మొగ్గుచూపారు. దిల్లీలో 84 మంది వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు నమోదు చేసుకున్నారు. కేరళలో వీరి సంఖ్య 59, హిమాచల్‌ ప్రదేశ్‌లో 54, జమ్ము కశ్మీర్‌లో 29, గోవాలో 2గా ఉంది. లక్షద్వీప్‌, మిజోరామ్‌ల్లో ఎవరూ ముందుకు రాలేదు.

అత్యధికులు నమోదు చేసుకున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌ (6,765), ఆంధ్రప్రదేశ్‌ (4,781), గుజరాత్‌ (2,915), మహారాష్ట్ర (632), బిహార్‌ (583), రాజస్థాన్‌ (549), తమిళనాడు (309), మధ్యప్రదేశ్‌ (305), పశ్చిమ్‌ బంగ (234) ఉన్నాయి. ప్రధానమంత్రి లఘు వ్యాపారీ మాన్‌-ధన్‌ యోజన పేరిట ప్రారంభమైన ఈ పథకంలో స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. 18-40 ఏళ్ల వయసు ఉన్న వారు నమోదు చేసుకుంటే 60 ఏళ్లు వచ్చిన తర్వాత నెలకు కనీసం రూ.3000 పింఛన్‌ పొందొచ్చు.

ఈ పథకానికి మోస్తరు ప్రతిస్పందనపై వ్యాఖ్యానిస్తూ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, ఈ పథకంలో ఎక్కువ మంది వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రవేశ వయస్సు, ప్రీమియం పెంచాలని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఒక వ్యాపారి జీవిత‌కాలం చెల్లించే మొత్తం పన్ను నుంచి ఒక నిధిని సృష్టించి 60 ఏళ్ల త‌ర్వాత వారికి నెల‌వారీ పెన్ష‌న్ చెల్లించేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ మాదిరిగా నిబంధ‌న‌లు తీసుకురావాల‌ని వ్యాపార సంఘం ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు తెలిపింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని