ఎన్‌పీఎస్‌లో త‌గ్గిన ఈక్విటీ ప‌రిమితి

కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాల‌, ప్రేవేట్ రంగం, ఎన్‌పిఎస్ లైట్‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న వంటి అన్ని ఎన్‌పీఎస్ స్కీముల‌కు పిఎఫ్ఆర్‌డిఎ మార్గ‌ద‌ర్శ‌కాలు....

Published : 19 Dec 2020 10:43 IST

కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాల‌, ప్రేవేట్ రంగం, ఎన్‌పిఎస్ లైట్‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న వంటి అన్ని ఎన్‌పీఎస్ స్కీముల‌కు పిఎఫ్ఆర్‌డిఎ మార్గ‌ద‌ర్శ‌కాలు​​​​​​​

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో అధికశాతం పెట్టుబ‌డులు పెట్టేందుకు పెన్ష‌న్ మేనేజ‌ర్ల‌కు వెసులుబాటు ఉండేది. దాన్నినియంత్రించ‌డానికి పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) ఈక్వీటి మ్యూచువ‌ల్ ఫండ్‌లో పెట్టుబ‌డిని 5 శాతానికి ప‌రిమితం చేసింది. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో, ఎన్‌పీఎస్ పెట్టుబ‌డుల‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మారుస్తూ గ‌త‌వారం స‌ర్క్యులార్‌ను జారీ చేసింది. దీని ప్ర‌కారం ఈక్వీటి మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డులు మొత్తం పొర్టుఫోలియోలో 5% కంటే ఎక్కువ‌గా వుండ‌కూడ‌దు.

ఈక్విటి పెట్టుబ‌డులపై నిబంధ‌న‌లు:

వ్య‌క్తులు లేదా ఆస్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌ల ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో గానీ, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల‌లో లేదా ఇండెక్స్ ఫండ్ల‌లో పెన్ష‌న్ ఫండ్ల ద్వారా పెట్టే పెట్టుబ‌డుల‌పై ఎలాంటి నిర్వ‌హ‌ణ రుసుము ఉండ‌దు.
అయితే మ్యూచువ‌ల్ ఫండ్‌, ఇండెక్స్ ఫండ్‌, ఎక్సేంజ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేసేందుకు కొన్ని నిబంధ‌న‌లుంటాయి . కంపెనీల షేర్లలో పెట్టుబ‌డి చేయాలంటే వాటి మార్కెట్ విలువ‌, పెట్టుబ‌డులు ప్రారంభించేనాటికి రూ.5 వేల‌ కోట్ల క‌న్నా త‌క్కువ‌గా వుండ‌కూడ‌దు. అదేవిధంగా వాటికి సంబంధించిన డెరివేటివ్‌లు రెండు ఎక్స్‌ఛేంజీల‌లోనూ ట్రేడింగ్ అవుతూ ఉండాలి. ఈ పెట్టుబ‌డి మార్గద‌ర్శ‌కాలు అన్ని ఎన్‌పీఎస్ స్కీముల‌కు కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాల‌, ప్రేవేట్ రంగం, ఎన్‌పీఎస్ లైట్‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న వంటి అన్ని ప‌థ‌కాల‌కు వ‌ర్తిస్తాయి.

ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు ఎలా ఆదా చేసుకోవాలి:

జూన్ 3వ తేది 2015, మే 4వ తేది 2017 లో పీఎఫ్ఆర్‌డీఏ ఇచ్చిన మార్గద‌ర్శ‌కాల ప్ర‌కారం పెన్ష‌న్ ఫండ్ మ‌దుపు చేయ‌డంలో ఫండ్ నిర్వ‌హ‌ణ రుసుం చెల్లింపు, అవి పెట్టిన పెట్టుబ‌డులు విలువ మీద ఆధార‌ప‌డి వుంటుంది. పీఎఫ్ఆర్‌డీఏ స‌ర్క్యులర్ ప్ర‌కారం పెట్టుబ‌డుదారులు ఇక‌ రెండు సార్లు ఛార్జీలు చెల్లించే అవ‌స‌రం ఉండ‌ద‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చింది. మొద‌టిది పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌రు తీసుకొనే పెట్టుబ‌డి రుసుము. రెండ‌వ‌ది మ్యూచువ‌ల్ పండ్ కంపెనీల‌కు చెల్లించే ఫీజులు.

ఎన్‌పీఎస్‌లో ఉన్న‌త ఈక్విటీ పెట్టుబ‌డులు:

ప్రైవేటు రంగానికి చెందిన‌ చందాదారులు ఎన్‌పీఎస్ యాక్టివ్ చాయిస్ ఆప్ష‌న్‌లో 75% పెట్టుబ‌డి పెట్టే అవ‌కాశం వుంది. 2009లో ప్రైవేటు చందాదారులకు ఎన్‌పీఎస్‌లో చేరే అవ‌కాశం ఇచ్చిన నాటి నుంచి ఇది 50% గా ఉండేది. చిన్న వ‌య‌స్సులో పెట్ట‌బ‌డి ప్రారంభించే వారు దీర్ఘ‌కాలం పెట్టుబ‌డి కొన‌సాగించ‌డం ద్వారా అధిక రాబ‌డి పొంద‌వ‌చ్చు. లేదా లైఫ్ సైకిల్ ఫండ్ ఎంచుకుంటే వ‌య‌స్సు పెరిగినా కొద్ది పెట్టుబ‌డులలోన‌ష్ట‌భ‌యం స‌ర్దుబాటు అవుతూ ఉంటుంది. వ‌య‌సు పెరిగే కొల‌దీ ఈక్విటీ శాతం త‌గ్గుతూ డెట్ శాతం పెరుగుతూ ఉంటుంది.

దీనికి ఆటో చాయిస్‌లో పెట్టుబ‌డులు చేయాల్సి ఉంటుంది.
ప్రైవేటు రంగ పెట్టుబ‌డి దారుల కోసం, పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌ర్‌ ఇప్పుడున్న 50 శాతం ఈక్విటీ పెట్టుబ‌డుల అవ‌కాశం ఉన్న‌ మోడ‌రేట్‌ లైఫ్ సైకిల్ ఫండ్ కాకుండా, మ‌రో రెండు లైఫ్ సైకిల్ ఫండ్ల‌ను ప్రారంభించింది. మొద‌టిది 75% ఈక్విటీ క్యాప్ ఉన్న అగ్ర‌సీవ్ లైఫ్ సైకిల్ ఫండ్ (ఎల్‌సీ 75), మ‌రోటి 25% ఈక్విటీ క్యాప్ క‌లిగిన క‌న్స‌ర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్‌(ఎల్‌సీ 25).

రెగ్యూలేట‌ర్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ ప్ర‌కారం మ్యూచువ‌ల్ ఫండ్ల‌ ద్వారా ఈక్వీటీ నిధుల‌ను 5% శాతానికి ప‌రిమితం చేయ‌డంతో చిన్న వ‌య‌సులో ఉన్న‌ పెట్టుబ‌డి దారుల‌కు ఛార్జీలు త‌గ్గ‌డంతో పాటు, ఎక్కువ శాతం ఈక్విటీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్రోత్సాహ‌న్నిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని