Residential Home: నిలిచిపోయిన 6.29 లక్షల ఇళ్ల నిర్మాణం!

దేశంలోని ఏడు అతిపెద్ద నగరాల్లో దాదాపు 6,29,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోవడమో లేక జాప్యమవడమో జరిగిందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ జరిపిన సర్వేలో తేలింది. ఆలస్యంగా నిర్మితమవుతున్న 71...

Published : 30 Jul 2021 23:01 IST

దిల్లీ: దేశంలోని ఏడు అతిపెద్ద నగరాల్లో దాదాపు 6,29,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోవడమో లేక జాప్యమవడమో జరిగిందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ జరిపిన సర్వేలో తేలింది. ఆలస్యంగా నిర్మితమవుతున్న 71 శాతం ఇళ్లు రూ.80 లక్షలు విలువ చేసే కేటగిరీ, 18 శాతం ప్రీమియం కేటగిరీలో, 11 సౌకర్యవంతమైన కేటగిరీలో ఉన్నాయని సర్వే తెలిపింది.

2014 లేదా అంతకంటే ముందే ప్రారంభమై ప్రస్తుతం నిలిచిపోయిన లేదా జాప్యమైన భవన నిర్మాణాల విలువ రూ.5.05 లక్షల కోట్లకు పైనే ఉంటుందని పేర్కొంది. అత్యధికంగా దిల్లీలో 52 శాతం ఇళ్ల నిర్మాణం జాప్యం/నిలిచిపోయిందని వెల్లడించింది. వీటి విలువ రూ.2.49 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఇక తర్వాత ముంబయిలో 28 శాతం నిర్మాణాలు ఆగిపోయాయని తెలిపింది. వీటి విలువను రూ.1.52 లక్షల కోట్లుగా లెక్కగట్టింది. తర్వాత పుణెలో రూ.29 వేల కోట్లు విలువ చేసే నిర్మాణాలు ఆగిపోయినట్లు తెలిపింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై.. మూడు నగరాల్లో కలిపి 11 శాతం నిర్మాణాలు నిలిచిపోయినట్లు పేర్కొంది. వీటి విలువ రూ.56,420 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. కోల్‌కతాలో రూ.17,960 కోట్లు విలువ చేసే ఐదు శాతం ఇళ్లు ఆగిపోయినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని