పోస్టాఫీస్ ప‌థ‌కాలు ఎందుకు వెన‌క‌బ‌డ్డాయి?

ఏజెంట్ల కమిషన్ తగ్గించడం ద్వారా చిన్న‌ పొదుపు ప‌థ‌కాల నుంచి మదుపరులను దూరం చేస్తున్నారు.....

Published : 22 Dec 2020 17:19 IST

ఏజెంట్ల కమిషన్ తగ్గించడం ద్వారా చిన్న‌ పొదుపు ప‌థ‌కాల నుంచి మదుపరులను దూరం చేస్తున్నారు.

ఫిబ్రవరి 2019 డెలాయిట్ నివేదిక ప్ర‌కారం, భారత జనాభాలో 34 శాతం , అంటే 40 కోట్ల మంది యువత ఉన్నారు. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కన్నా ఈ శాతం ఎక్కువ. పెద్ద జీతాలు, మంచి కోరుకుంటున్నారు . వీరిలో 52శాతం మంది పెద్ద జీతాలు సంపాదించి, కావాలనుకుంటున్నారు .

మన పెద్దలు పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీం లలో పొదుపు చేసేవారు. మ్యూచువల్ ఫండ్స్ , బీమా పథ‌కాలు అనుసరిస్తున్న మార్కెటింగ్ పద్ధతులతో , చిన్న పొదుపు పధకాల వైపు యువతను ఆకర్షించడం కష్టమవుతోంది . చిన్న పొదుపు పధకాల మొత్తం రూ 17.78 లక్షల కోట్ల డబ్బును నడుపుతున్న నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ (NSSF) కు యువతను ఆకర్షించడం ఒక సమస్య.

అనిశ్చిత, తగ్గుతున్న ఆదాయాల సమయంలో, 1 ఏప్రిల్ 2020 అమలు చేసిన తగ్గిన వడ్డీ రేట్లు చిన్న పొదుపరులను మరింత నిరాశకు గురిచేశాయి . అయితే ఆర్ధిక శాస్త్రవేత్తల, పరిశ్రమ వర్గాల ప్రకారం , సరైన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రేట్ల తగ్గింపు చర్యను తీసుకుందని తెలిపారు. దీనివలన బ్యాంకులు , పోస్ట్ ఆఫీస్ ప‌థ‌కాలు అందించే వడ్డీలలో తేడాలు తగ్గుతాయి- అని సౌమ్య కాంత్ ఘోష్ , ముఖ్య ఆర్ధిక సలహాదారు,స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తెలిపారు .

రేట్ల తగ్గింపు అత్యవసరం. అయితే కోవిడ్‌- 19 వంటి పరిస్థితిలో చాలా ఇబ్బంది. ముఖ్యంగా వయో వృద్ధులకు . ఎస్‌బీఐ అంచనా ప్రకారం , దేశంలో 4.1 కోట్ల వయో వృద్ధుల డబ్బు సుమారుగా రూ 14లక్షల కోట్ల టర్మ్ డిపాజిట్ లలో ఉన్నాయి . వడ్డీ రేట్లను ఒక్క సారిగా 8.6 శాతం నుంచి 7.4 శాతం , అంటే 1.20 శాతం తగ్గించిన కేంద్ర ప్రభుత్వం , వయో వృద్ధులకు పన్నులలో మినహాయింపు కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత వుందని ఘోష్ అన్నారు .

పోస్ట్ ఆఫీసులలో సమయపాలన, సానుభూతి లేకపోవడం , ముఖ్యంగా వయో వృద్ధుల విషయంలో నిరాశాజనకమైన సేవల వంటి లోపాలు కనిపిస్తాయి. చాలా పోస్ట్ ఆఫీస్ లలో సరైన సిబ్బంది , సేవలు, కుర్చీల వంటి సదుపాయాలు లేకపోవడం. అలాగే సాంకేతికత వినియోగించకపోవడం . పట్టణాలలోకూడా శుభ్రత లేక , వినియోగదారులను ఆకర్షించలేకపోతున్నాయి అని పేరు చెప్పని పోస్టల్ ఏజెంట్ తెలిపారు. సదుపాయాలతోపాటు సిబ్బందికి సాంకేతిక శిక్షణ కూడా చాలా అవసరం .

ఎస్బిఐ , ఐసీఐసీఐ లలో చిన్న పొదుపు పథకాల్లో మదుపు చేసేవారికి మెరుగైన సేవలు అందుతున్నాయి . పోస్ట్ ఆఫీస్ల లో కూడా ఇంటర్నెట్ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. యువత ఒకసారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు నమోదు చేసుకుంటే, నగదు జమ, బదిలీ వంటి సదుపాయాలు ఆన్లైన్ ద్వారా పొందొచ్చని అగర్వాల్, చీఫ్ పోస్టుమాస్టర్ , మహారాష్ట్ర తెలిపారు .

మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫి (AMFI) మార్చి 2017 లో ‘మ్యూచువల్ ఫండ్స్ సహి హై’ అనే నినాదంతో ముందుకొచ్చింది . మదుపరుల అవగాహన సదుస్సులను నిర్వహించడానికి రూ. 270 కోట్ల నిధి కలిగి వుంది . మ్యూచువల్ ఫండ్స్ లో జనవరి 2017లో సిప్ ద్వారా నెలకు రూ 4,000 కోట్లు జమ అవుతుంటే , అవి ప్రస్తుతం నెలకు రూ 8,500 జమ అవుతున్నాయి . అలాగే గతేడాది జీవిత బీమా కౌన్సిల్ ‘సబ్సే పెహలే జీవిత బీమా’ అనే నినాదంతో రూ 100 కోట్లతో ప్రచార కార్యక్రమాలు చేప‌ట్టింది.

సాధారణంగా బ్యాంకు మేనేజర్ లు కస్టమర్స్ తో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఇది పోస్ట్ ఆఫీస్ లలో లోపిస్తుంది. చిన్న పొదుపు ప‌థ‌కాల వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ , వీటిగురించి ప్రచారంలేక పోస్ట్ ఆఫీస్ లు ఖాతాదారులను పొందలేకపోతున్నాయి . పోస్టల్ ఏజెంట్స్ ల కమిషన్ లను 1 శాతం తగ్గించడం వలన వారు తమ కస్టమర్లను మ్యూచువల్ ఫండ్స్ వైపు మరలిస్తున్నారు. ముఖ్యంగా డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ లో కచ్చితమైన రాబడి ఉండనప్పకిటికీ , చిన్న పొదుపు పథకాలలో కచ్చితమైన రాబడి ఉన్నప్పటికీ , ఈ విషయాలు తెలియని కస్టమర్లు , తమ ఏజెంట్ చెప్పినట్లు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి చేస్తున్నారు , అని అహ్మదాబాద్ కు చెందిన ఆశిష్ షా , ఫౌండర్ , వెల్త్ ఫస్ట్ పోర్ట్ ఫోలియోమేనేజర్ తెలిపారు .

ఏజెంట్ల కమిషన్ తగ్గించడం ద్వారా , చిన్న పొదుపరులకు ఉపయోగపడే చిన్న పొదుపు ప‌థ‌కాల నుంచి మదుపరులను దూరం చేస్తున్నారు. చిన్న పొదుపు పథకాలలో ఉన్న మరో లోపం - నగదు లభ్యత. ముఖ్యంగా కోవిడ్-19 లాంటి సమయాల్లో. ప‌థ‌కాలు మంచివైనా ,5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ , పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్‌ స్కీం (SCSS), వంటి పథ‌కాలు వివిధ కాలాలకు లాక్-ఇన్ అవడం వలన నగదు లభ్యత కష్టమవుతుంది.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం (SCSS), 5 ఏళ్ల టైం డిపాజిట్, ఎన్ఎస్సి (NSC) ల వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. అయితే మీ పోర్ట్ ఫోలియో లో కొంత మొత్తం చిన్న పొదుపు పథకాలకు కేటాయించాలి. ఒక ఏడాది టైం డిపాజిట్ కు కూడా లాక్-ఇన్ టైం లో నగదు కావాలంటే , కనీసం 6 నెలలు ఆగాలి. అప్పుడు వడ్డీని 5.5 శాతం నుంచి 4 శాతానికి లెక్కిస్తారు.

ఆలస్యంగానైనా , పోస్టల్ శాఖ తమ స్కీం లను, జీవిత బీమా పధకాలను, పోస్టుమేన్ , మహిళల ద్వారా ప్రచారంలోకి తెస్తున్నాయి . ఏదిఏమైనప్పటికీ , ఈ చిన్న పొదుపు పధకాలు అనేక విధాలుగా ఉపయోగిస్తాయి. ఉదా : పీపీఎఫ్ ఫై 7.1 శాతం వడ్డీ లభిస్తున్నప్పటికీ , వడ్డీ ఆదాయంపై పన్ను లేకపోవడం వలన, అనేక ఆర్ధిక లక్ష్యాలకోసం వినియోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని