కొవాగ్జిన్‌కు నేపాల్‌లోనూ అనుమతి!

భారత్‌లో తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి నేపాల్‌ జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. దీంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగానికి ఇప్పటి......

Published : 20 Mar 2021 14:22 IST

కాఠ్‌మండూ: భారత్‌లో తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి నేపాల్‌ జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. దీంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగానికి ఇప్పటి వరకు మూడు దేశాల్లో అనుమతి లభించినట్లైంది. కరోనా నిరోధంపై 81 శాతం సమర్థత కనబరిచిన ఈ టీకా వినియోగానికి కేంద్ర ప్రభుత్వం జనవరిలోనే అత్యవసర వినియోగం కింద అనుమతులు జారీ చేసింది. ఈ నెల ఆరంభంలో జింబాబ్వే ప్రభుత్వం సైతం కొవాగ్జిన్‌ టీకా వినియోగానికి పచ్చజెండా ఊపింది.

నేపాల్‌ ఇప్పటి వరకు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కొవిషీల్డ్‌, చైనాకు చెందిన సైనోఫార్మ్‌ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ-కోర్‌వీ టీకాల వినియోగానికి అనుమతినిచ్చింది. భారత్‌ బయోటెక్‌ తమ టీకా కోసం జనవరి 13న దరఖాస్తు చేసుకోగా తాజాగా అనుమతిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లో ఇప్పటి వరకు 2,75,750 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,016 మంది మరణించారు.

ఇవీ చదవండి...

కరోనా ఉద్ధృతి: 40 వేలు దాటిన కేసులు

కొవిడ్‌తో కొత్త పేదరికం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని