TAX: రూ.1.85లక్షల కోట్ల పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. జూన్‌ 15 నాటికి రూ. 1.85లక్షల కోట్ల పన్నులు వసూలైనట్లు తెలిపింది

Published : 16 Jun 2021 19:48 IST

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. జూన్‌ 15 నాటికి రూ. 1.85లక్షల కోట్ల పన్నులు వసూలైనట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 92,762కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది వసూళ్లు 100.4శాతం పెరిగినట్లు పేర్కొంది. 

ఇందులో కార్పొరేషన్‌ పన్ను వసూళ్లు రూ. 74,356 కోట్లు కాగా.. పర్సనల్‌ ఇన్‌కం ట్యాక్స్‌, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ రూ. 1.11లక్షల కోట్లు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు(రీఫండ్‌ చేయకముందు) రూ. 2.16లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా రెండో దశ ఉద్ధృతి  కొనసాగినప్పటికీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అడ్వాన్స్‌ పన్ను వసూళ్లు పెరిగాయని తెలిపింది. జూన్‌ 15 నాటికి రూ. 28,780కోట్లు అడ్వాన్స్‌ పన్ను చెల్లింపుల కింద వసూలైనట్లు వెల్లడించింది. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 30,371 కోట్ల మేర రీఫండ్‌ చెల్లించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని