Q1 Results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం ₹7729 కోట్లు

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికరలాభం 16.1 శాతం పెరిగి రూ.7,729.6 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో.....

Published : 17 Jul 2021 22:26 IST

ముంబయి: దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 16.1 శాతం పెరిగి రూ.7,729.6 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంకు నికరలాభం రూ.6,658.6 కోట్లుగా ఉంది. అయితే, క్రితం త్రైమాసికంతో పోలిస్తే నికర లాభంలో 6.5 శాతం క్షీణత కనిపించింది. నికర వడ్డీ ఆదాయం కూడా 8.57 శాతం పెరిగి రూ.17,009 కోట్లకు చేరింది. బ్యాంక్‌ నికర ఆదాయం 18 శాతం పెరిగి రూ.23,297.5 కోట్లుగా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం 54.3 శాతం పెరిగి రూ.6228.5 కోట్లుగా రికార్డయింది. స్థూల నిరర్ధక ఆస్తులు 1.32 శాతం (డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో) నుంచి 1.47 శాతానికి పెరిగాయి. కరోనా రెండో దశ ప్రభావం బ్యాంకు కార్యకలాపాలపై పడిందని ఓ ప్రకటనలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని