Netflix mobile games: నెట్‌ఫ్లిక్స్‌లో మొబైల్ గేమ్స్.. ఏయే ఆటలంటే?
ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ గేమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది....
ఇంటర్నెట్ డెస్క్: కరోనా నివారణ నిమిత్తం విధించిన లాక్డౌన్ల పుణ్యమా అని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలకు ఆదరణ పెరిగింది. ఈ రంగంలో అనేక యాప్‌లు పుట్టుకొచ్చాయి. దీంతో పోటీ తీవ్రమైంది. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అదించేందుకు పోటీ పడుతున్నాయి. అనేక సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా నెట్‌ఫ్లిక్స్ మరో కొత్త సర్వీస్‌తో యూజర్స్‌ని అలరించేందుకు సిద్ధమైంది.
ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్.. మొబైల్ గేమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఇవి ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండన్నాయి. స్ట్రేంజర్ థింగ్స్: 1984(బోనస్ఎక్స్పీ); స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్(బోనస్ఎక్స్పీ); షూటింగ్ హూప్స్ (ఫ్రాస్టీ పాప్); కార్డ్ బ్లాస్ట్ (అమ్యూజో అండ్ రోగ్ గేమ్స్); టీటర్ అప్ (ఫ్రాస్టీ పాప్).. ఈ ఐదు మొబైల్ గేమ్స్ ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్ వేదికపై అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్తులో మరిన్ని గేమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపింది.
ఈ గేమింగ్ సేవలకు ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. పైగా ఎలాంటి ప్రకటనలు కూడా ఉండవని పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి లాగిన్ కాగానే.. ప్రత్యేకంగా ఓ గేమ్స్ వరుస తెరపై కనిపిస్తుంది. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. ఆండ్రాయిడ్ ట్యాబ్‌లలోనూ ప్రత్యేక గేమ్స్ వరుస లేదా డ్రాప్ డౌన్ మెనూలో గేమ్స్ అనే ఆప్షన్ ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న అనేక భాషల్లో ఈ గేమ్స్‌ను ఆడొచ్చు. ఒకవేళ ఏదైనా భాష లేకపోతే ఇంగ్లిష్ డిఫాల్ట్‌గా ఉంటుంది. అయితే, పిల్లల భద్రత దృష్ట్యా కిడ్స్ ప్రొఫైల్స్‌లో ఈ గేమ్స్ అందుబాటులో ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!