Maruti Suzuki: మార్కెట్లోకి సరికొత్త తరం సెలెరియో..!

మారుతీ సుజుకీ సరికొత్తతరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.4.99 లక్షలు కాగా.. హైఎండ్‌ మోడల్‌ ధర రూ.6.94 లక్షలుగా పేర్కొంది. భారత్‌లో విడుదలైన రెండో సెలెరియో ఇదే కావడం విశేషం.

Published : 10 Nov 2021 17:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మారుతీ సుజుకీ సరికొత్తతరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.4.99 లక్షలు కాగా.. హైఎండ్‌ మోడల్‌ ధర రూ.6.94 లక్షలుగా పేర్కొంది. భారత్‌లో విడుదలైన రెండో తరం సెలెరియో ఇదే కావడం విశేషం. మారుతీ హియర్టెక్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మించారు. భారత్‌లోనే ఇది అత్యధిక మైలేజ్‌ ఇచ్చేకారుగా మారుతీ చెబుతోంది. ఈ కారులో స్టార్ట్‌-స్టాప్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే 1.0 లీటర్‌ డ్యూయల్‌ జెట్‌, డ్యూయల్‌ వీవీటీ కె10సీ ఇంజిన్‌ను అమర్చారు. ఈ కారు ఏఆర్‌ఏఐ లెక్కల ప్రకారం లీటర్‌ పెట్రోల్‌కు 26.68 కిలోమీటర్ల  మైలేజీని ఇస్తుంది. 

ఈ కారు విడుదల సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో కెన్చీ అయికువా మాట్లాడుతూ ‘‘ కొత్త సెలెరియో వినియోగదారుల అంచనాలను పూర్తిస్థాయిలో అందుకొంటుంది. అద్భుతమైన డ్రైవింగ్‌ అనుభవం, సాటిలేని మైలేజీ, ఆకర్షణీయమైన సౌకర్యాలు, భద్రత వంటివి అతితక్కువ ధరలో వినియోగదారులకు లభించనున్నాయి. తొలితరం సెలెరియోలో కూడా ఆటోగేర్‌షిఫ్ట్‌ టూపెడల్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాము’’ అని పేర్కొన్నారు. ఈ కారు మొత్తం ఆరురంగుల్లో అందుబాటులోకి వచ్చింది. కారులోపల ఆల్‌బ్లాక్‌ ఇంటీరియర్‌, త్రీస్పోక్‌ టిల్ట్‌ అడ్జెస్టబుల్‌ స్టీరింగ్‌, ఆడియో-టెలిఫోన్‌ కంట్రోల్స్‌ స్టీరింగ్‌పైనే ఉన్నాయి. లార్జ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, డిజిటల్‌ రీవ్‌ కవర్‌,7 అంగుళాల స్మార్ట్‌ ప్లే స్టూడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని