New Generation Royal Enfield Classic 350: సరికొత్త రాయల్‌ ఎన్ఫీల్డ్‌ క్లాసిక్‌ విడుదల..!

భారత్‌లో సరికొత్త తరం2021 రాయల్‌ ఎన్ఫీల్డ్‌ క్లాసిక్‌ 350ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.84లక్షలుగా నిర్ణయించారు.

Published : 01 Sep 2021 20:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో సరికొత్త తరం2021 రాయల్‌ ఎన్ఫీల్డ్‌ క్లాసిక్‌ 350ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.84లక్షలుగా నిర్ణయించారు. ఫీచర్లను బట్టి ఇది రూ.2.15 లక్షల వరకు ఉంది. రాయల్‌ ఎన్ఫీల్డ్‌ల్లో క్లాసిక్‌ 350 మోడల్‌ అత్యధికంగా అమ్ముడవుతోంది. మొత్తం కంపెనీ విక్రయాల్లో దీని వాటా 80శాతం. మెటియోర్‌ 350 తర్వాత మార్కెట్లోకి విడుదల చేసిన రెండో మోడల్‌ ఇదే. 

దీనిలో 349 సీసీ ఇంజిన్‌ ఉంది. ఇది 20.2 బీహెచ్‌పీ శక్తిని 6,100 ఆర్పీఎం వద్ద విడుదల చేస్తుంది. 4,000 ఆర్పీఎం వద్ద 27ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఈ బైకు మొత్తం 11 రంగుల్లో లభించనుంది. ప్రతి ఒక్కదానికి ఒక్కో రేటు ఉంది. డిజిటల్‌ ఎనలాగ్‌ మీటర్‌ను బైక్‌కు అమర్చారు.  బైకుకు మందు వైపు 300 ఎంఎం , వెనుకవైపు 270 ఎంఎం డిస్క్‌ బ్రేకులను అమర్చారు. ఈ బైక్‌ అలాయ్‌ వీల్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్స్‌తో లభిస్తుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని