Auto debit: వినియోగదారు అనుమతితోనే ‘ఆటో డెబిట్‌’ చెల్లింపులు 

ఆటో డెబిట్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై మొబైల్, డీటీహెచ్‌ రీఛార్జ్‌లు, ఇతరత్రా బిల్లుల చెల్లింపులు ఇకపై ఆటోమెటిక్‌గా జరగవు....

Published : 01 Oct 2021 10:14 IST

నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి

దిల్లీ: ఆటో డెబిట్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై మొబైల్, డీటీహెచ్‌ రీఛార్జ్‌లు, ఇతరత్రా బిల్లుల చెల్లింపులు ఇకపై ఆటోమెటిక్‌గా జరగవు. నియోగదారు అదనపు అనుమతి తప్పనిసరి అవుతుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా కార్డులు లేదా ప్రీపెయిడ్‌ చెల్లింపు మార్గాలు (పీపీఐలు) లేదా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా ఆటో డెబిట్‌ లావాదేవీలను 2021 మార్చి 31 తర్వాత నుంచి ఏఎఫ్‌ఏ నిబంధలను పాటించకుండా ప్రాసెస్‌ చేయొద్దని గతేడాది డిసెంబరు 4న బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీలు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ గేట్‌వేలకు ఆర్‌బీఐ ఆదేశాలిచ్చింది. లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని సంస్థలు ఈ నిబంధనలను పాటించేందుకు పూర్తిగా సన్నద్ధం కానందున 2021 సెప్టెంబరు 30 వరకు గడువును పొడిగించింది. ఆ గడువు ముగియడంతో, కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ ప్రకారం.. ఆటో డెబిట్‌ తేదీ గురించి, ముందస్తుగా బ్యాంకులు వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారు అనుమతి అనంతరమే ఆటో డెబిట్‌ లావాదేవీని పూర్తి చేయాలి. రూ.5,000కి మించిన ఆటో డెబిట్‌ చెల్లింపులకైతే వినియోగదారులకు ఒకసారి పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ని బ్యాంకులు పంపించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలపై బ్యాంకులు వినియోగదారులకు సమాచారం ఇచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని