కొత్త ఆదాయ ప‌న్ను రేట్లు

ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ ఫై ప్రతి రంగానికి ఎటువంటి కేటాయింపులు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వబోతున్నారో అని ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఉద్యోగస్తులైతే తమకు ఆదాయపు పన్నుల్లో మినహాయింపులు, తగ్గింపుల గురించి చూస్తుంటారు. ఈ ఏడాది బడ్జెట్ లో ఉన్న పన్ను విధానానికి , మరొక పన్ను విధానాన్ని కూడా ప్రవేశ పెట్టారు. ఈ..

Updated : 10 Oct 2021 22:40 IST

ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ ఫై ప్రతి రంగానికి ఎటువంటి కేటాయింపులు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వబోతున్నారో అని ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఉద్యోగస్తులైతే తమకు ఆదాయపు పన్నుల్లో మినహాయింపులు, తగ్గింపుల గురించి చూస్తుంటారు. ఈ ఏడాది బడ్జెట్ లో ఉన్న పన్ను విధానానికి , మరొక పన్ను విధానాన్ని కూడా ప్రవేశ పెట్టారు. ఈ రెండింటిలో ఏది అనుకూలంగా ఉంటే, ఆ పద్ధతిని అనుసరించవచ్చని తెలిపారు. అవేమిటో తెలుసుకుందాం .

ఫై పట్టికలో చూపినట్లు పాత పద్ధతిలో అన్ని మినహాయింపులు పోను వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉంటే ఎటువంటి పన్ను ఉండదు. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఉంటె 5 శాతం పన్ను. అయితే రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా సెక్షన్ 87ఏ కింద మినహాయింపు పొందొచ్చు. రూ. 5 లక్షల నుంచి పది లక్షల మధ్య ఆదాయానికి 20 శాతం, రూ. పది లక్షల పైన ఆదాయానికి 30 శాతం పన్ను వర్తిస్తుంది. పన్ను ఫై 4 శాతం సెస్ అదనం.

ఆర్ధిక సంవత్సరం 2020-21 కి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రెండవ పధ్ధతిని కూడా తెలిపారు. దీని ప్రకారం పన్ను చెల్లింపు దారులు ఎటువంటి మినహాయింపులు పొందకుండా , తగ్గించిన పన్ను స్లాబ్ ల ప్రకారం లెక్కించ వలసి ఉంటుంది .

ఫై పట్టికలో చూపినట్లు కొత్త పద్ధతిలో ఎటువంటి మినహాయింపులు లేకుండా వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉంటే ఎటువంటి పన్ను ఉండదు.
రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఉంటె 5 శాతం పన్ను. అయితే రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా సెక్షన్ 87ఏ కింద మినహాయింపు పొందొచ్చు.
రూ. 5 లక్షల నుంచి రూ. 7.50 లక్షల మధ్య ఆదాయానికి 10 శాతం,
రూ. 7.50 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయానికి 15 శాతం,
రూ. 10 లక్షల నుంచి రూ.12.50 లక్షల మధ్య ఆదాయానికి 20 శాతం,
రూ. 12.50 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం,
రూ. 15 లక్షల పైన ఆదాయానికి 30 శాతం పన్ను వర్తిస్తుంది.
పన్ను ఫై 4 శాతం సెస్ అదనం.

ఈ కింది పట్టిక ద్వారా ఎవరికి ఎంత పన్ను వర్తిస్తుందో చూద్దాం:

ఉదా: పన్ను మినహాయింపుల కింద ఈ కింది వాటిని గరిష్ట మొత్తంలో ఎంత వరకు తీసుకోగలమో చూద్దాం :
ప్రామాణిక మినహాయింపు: రూ 50,000
సెక్షన్ 80సి : రూ 1,50,000 ( జీవిత బీమా ప్రీమియం, ప్రావిడెంట్ ఫండ్, పీ పీ ఎఫ్, ఎన్ ఎస్ సి, ఎన్ పీ ఎస్, 5 ఏళ్ల ఫిక్సెడ్ డిపాజిట్, పిల్లల ట్యూషన్ ఫీజు, యులిప్స్ , గృహ రుణ అసలు చెల్లింపు మొదలైనవి)
సెక్షన్ 80 సీసీడీ (1బి) రూ 50,000 (ఎన్ పీ ఎస్ లో చేసిన అదనపు పెట్టుబడి)
సెక్షన్ 80డి : రూ 25,000 (ఆరోగ్య బీమా ప్రీమియం)
సెక్ష 24బి: రూ 2,00,000 (గృహ రుణ వడ్డీ చెల్లింపు)

ఆప్షన్ A , ఆప్షన్ B , ఆప్షన్ C ల ద్వారా ఎంత మేరకు పన్ను పడుతుందో చూద్దాము.

ఆప్షన్ A - పాత పద్ధతిలో :
ఫై పట్టికలో పట్టికలో స్థూల వార్షిక ఆదాయం రూ 7.50 లక్షలుగా పరిగణించి, అందులో ప్రామాణిక మినహాయింపుగా రూ 50 వేలు, అలాగే సెక్షన్ 80సి, 80 సీసీ డి (1బి), 80డి , 24 బి కింద గరిష్టంగా తీసుకున్నట్లైతే, మొత్తం మినహాయింపు రూ. 4.25 లక్షలు అనుకుంటే, పన్ను విధింపబడే ఆదాయం రూ. 2.75 లక్షలు. రూ. 2.50 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు. మిగిలిన రూ. 25 వేలపై 5 శాతం అంటే రూ. 1,250/- పన్ను వర్తిస్తుంది. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం ద్వారా మినహాయింపు పొందొచ్చు.

ఆప్షన్ B - పాత పద్ధతిలో :
ఫై పట్టికలో పట్టికలో స్థూల వార్షిక ఆదాయం రూ 7.50 లక్షలుగా పరిగణించి, అందులో ప్రామాణిక మినహాయింపుగా రూ 50 వేలు, అలాగే సెక్షన్ 80సి కింద మొత్తం మినహాయింపు రూ. 1 లక్ష అనుకుంటే, పన్ను విధింపబడే ఆదాయం రూ. 6 లక్షలు.
రూ. 2.50 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు.
తదుపరి రూ. 2.50 లక్షలపై (అంటే రూ. 2.50 - 5 లక్షల మధ్య) 5 శాతం పన్ను = రూ. 12,500.
తదుపరి రూ. 1 లక్షపై (అంటే రూ. 5 - 6 లక్షల మధ్య) 20 శాతం పన్ను = రూ. 20,000.
మొత్తం పన్ను రూ. 33,800 ( రూ. 32,500 + 4% సెస్ రూ. 1,300)

ఆప్షన్ C - కొత్త పద్ధతిలో :
ఫై పట్టికలో స్థూల వార్షిక ఆదాయం రూ 7.50 లక్షలుగా పరిగణించి, ఎటువంటి మినహాయింపులు ఉండవు. కాబట్టి పన్ను విధింపబడే ఆదాయం రూ. 7.50 లక్షలు. రూ. 2.50 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు.
తదుపరి రూ. 2.50 లక్షలపై (అంటే రూ. 2.50 - 5 లక్షల మధ్య) 5 శాతం పన్ను = రూ. 12,500. .
తదుపరి రూ. 2.50 లక్షలపై (అంటే రూ. 5 - 7.5 లక్షల మధ్య) 10 శాతం పన్ను రూ. 25,000.
మొత్తం పన్నురూ. 39,000 ( రూ. 37,500 + 4% సెస్ రూ. 1,500)

ఉదా: స్థూల వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు ఉన్నట్లయితే :
ఆప్షన్ A - పాత పద్ధతిలో : పన్ను రూ. 18,200
ఆప్షన్ B - పాత పద్ధతిలో : పన్ను రూ.85,800
ఆప్షన్ C - కొత్త పద్ధతిలో : పన్ను రూ.78,000

ఉదా: స్థూల వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు ఉన్నట్లయితే :
ఆప్షన్ A - పాత పద్ధతిలో : పన్ను రూ.1,24,800
ఆప్షన్ B - పాత పద్ధతిలో : పన్ను రూ.2,26,200
ఆప్షన్ C - కొత్త పద్ధతిలో : పన్ను రూ.1,95,000

ముగింపు:
ప్రతి ఒక్కరు తమ ఆదాయాన్ని, మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని , ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసుకోవాలి. తద్వారా ఏ పద్ధతిలో తక్కువ పన్ను పడుతుందో చూసుకుని , ఆ పద్ధతిలోకి మారవచ్చు. సాధారణంగా సంస్థ యాజమాన్యం వారు ఈ విషయంలో ఉద్యోగులకు సహాయపడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని