Nippon India: నిప్పన్‌ ఇండియా నుంచి సిల్వర్‌ ఈటీఎఫ్‌, ఎఫ్‌ఓఎఫ్‌

నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన నిప్పన్‌ లైఫ్‌ ఇండియా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ కొత్తగా సిల్వర్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్‌)ను ప్రారంభించింది.

Published : 05 Jan 2022 20:27 IST

దిల్లీ: నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన నిప్పన్‌ లైఫ్‌ ఇండియా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ కొత్తగా సిల్వర్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్‌)ను ప్రారంభించింది. వెండి, వెండితో తయారైన వస్తువుల్లో పెట్టుబడుల కోసం బుధవారం దీన్ని లాంచ్‌ చేసింది. అలాగే, సిల్వర్‌ ఈటీఎఫ్‌లోని యూనిట్ల కొనుగోలు కోసం ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌)ను కూడా నిప్పన్‌ ఇండియా ప్రారంభించింది. ఈ రెండు పథకాలూ జనవరి 13 నుంచి జనవరి 27 వరకు ఓపెన్‌లో ఉంటాయి.

నిప్పన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో)లో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆపై రూ.1 చొప్పున ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టొచ్చు. అదే ఎఫ్‌ఓఎఫ్‌లో అయితే కనీస పెట్టుబడి మొత్తం రూ.100. లండన్‌ బులియన్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ (ఎల్‌బీఎంఏ) ఆమోదం పొందిన 99.9 శాతం స్వచ్ఛత కలిగిన సిల్వర్‌ ఫండ్లలో మదుపు చేస్తామని నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెట్‌ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఎలాంటి డీమ్యాట్‌ అకౌంట్‌ లేకుండానే సిల్వర్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టొచ్చని పేర్కొంది. సిప్‌ విధానంలోనూ మదుపు చేయొచ్చని తెలిపింది. సిల్వర్‌ ఎఫ్‌ఓఎఫ్‌ను తొలిసారి తామే ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని