Corona Crisis: ‘నిస్సాన్‌’ భారీ సాయం 

కరోనాతో దేశంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ మోటార్‌ ఇండియా భారీ సహకారం అందించింది. కరోనా నివారణ చర్యల నిమిత్తం రూ.6.5కోట్ల ...

Updated : 27 May 2021 20:53 IST

దిల్లీ: కరోనాతో దేశంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ మోటార్‌ ఇండియా భారీ సహకారం అందించింది. కరోనా నివారణ చర్యల నిమిత్తం రూ.6.5కోట్ల సాయం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సహాయ నిధికి రూ.2.2కోట్లు; తమిళనాడు సీఎం సహాయ నిధికి రూ.25లక్షలు చొప్పున విరాళంగా అందజేసింది. అలాగే, రూ.4.3కోట్లు విలువ చేసే మాస్క్‌లు, పీపీఈ కిట్లు, తదితర పరికరాలను అందజేసినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా దిల్లీ రాజధాని పరివాహక ప్రాంతం, చెన్నైలలో ఎన్‌ 95 మాస్కులు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు, పోర్టబుల్‌ ఈసీజీ, ఎక్స్‌రే మిషన్లతో పాటు పల్స్‌ ఆక్సీమీటర్లు, నాజల్‌ ఆక్సిజన్‌ యంత్రాలను పంపిణీ చేసినట్టు పేర్కొంది. 

నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ రాకేశ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సమాజంతో పాటు తమ కస్టమర్లు, భాగస్వాములు, ఉద్యోగుల భద్రత, వారి శ్రేయస్సు ఎంతో ముఖ్యమని తెలిపారు.  ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. అంతేకాకుండా, లాక్‌డౌన్‌తో నెలకొన్న ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రెనాల్ట్‌ నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఏఐపీఎల్‌) వరల్డ్‌ కమ్యూనిటీ సెర్వీస్‌ సెంటర్‌ భాగస్వామ్యంతో వలస కార్మికులకు ఆహార పొట్లాలను సరఫరాచేస్తోంది. ప్రభుత్వాల మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తూ తమ చర్యలను కొనసాగిస్తున్నట్టు ఆర్‌ఎన్‌ఏఐపీఎల్‌ ఎండీ బిజూ బాలేంద్రన్‌  తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని