Nitin Gadkari: అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోండి..!

దేశంలోని ఆటోమొబైల్‌ పరిశ్రమలోని ‘ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మేనిఫ్యాక్చర్స్‌’(ఓఈఎం) ఎప్పటికప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో నిరంతరం నాణ్యతను

Published : 06 Jul 2021 17:21 IST

 ఆటోమొబైల్‌ విడిభాగాల పరిశ్రమకు కేంద్ర మంత్రి సూచన

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోని ఆటోమొబైల్‌ పరిశ్రమలోని ‘ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానిఫ్యాక్చర్స్‌’(ఓఈఎం) ఎప్పటికప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో నిరంతరం నాణ్యతను పెంచుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఆయన పుణెలోని ఎంఐటీ-ఏడీటీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో ఓఈఎంలకు చాలా మార్కెట్‌ షేరు ఉన్నా.. వారి పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాద పరీక్షా ప్రమాణాలకు ఎక్కడా తగ్గకుండా వాహనాల తయారీ వారి సామాజిక బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ఈక్రమంలో వాహనాల ధరలు పెరిగినా ఫర్వాలేదన్నారు. బస్సుల బాడీ నాణ్యత మరింత మెరుగుపడాల్సి ఉందని సూచించారు.

ప్రపంచ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ బాగా విస్తృతమైందని గడ్కరీ పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రతపై దృష్టిపెట్టాలన్నారు. భారత్‌, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 1.5లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. ఇవి కొవిడ్‌ మరణాల కంటే ఎక్కువని చెప్పారు. వీరిలో అత్యధిక మంది ద్విచక్ర వాహన వినియోగదారులే అని పేర్కొన్నారు. 2025 నాటికి 50 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చెప్పారు. 2030 నాటికి నూరు శాతం ప్రమాదాలను తగ్గించాలన్నారు. డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక డ్రైవింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని