బ్యాంకుల‌ సేవాఛార్జీలు పెర‌గ‌లేదు

ప్రభుత్వ రంగ బ్యాంకులు విధించే సేవా ఛార్జీలను ఇటీవల పెంచలేదని పేర్కొంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. బ్యాంకులు సేవా ఛార్జీలను ఎక్కువ‌గా పెంచిన‌ట్లు వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో అటువంటిది ఏమిలేద‌ని స్ప‌ష్టత‌నిచ్చింది. జన ధన్ ఖాతాలతో సహా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాలలో, సేవా ఛార్జీలు వర్తించవు..

Updated : 01 Jan 2021 19:17 IST

ప్రభుత్వ రంగ బ్యాంకులు విధించే సేవా ఛార్జీలను ఇటీవల పెంచలేదని పేర్కొంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. బ్యాంకులు సేవా ఛార్జీలను ఎక్కువ‌గా పెంచిన‌ట్లు వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో అటువంటిది ఏమిలేద‌ని స్ప‌ష్టత‌నిచ్చింది. జన ధన్ ఖాతాలతో సహా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాలలో, సేవా ఛార్జీలు వర్తించవు. 41.13 కోట్ల జన ధన్ ఖాతాలతో సహా 60.04 కోట్ల బీఎస్‌బీడీ ఖాతాలపై సేవా ఛార్జీలు ఉండవు.

రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ అకౌంట్లు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు & ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు:
అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా నవంబర్ 1, 2020 నెలకు ఉచిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణల సంఖ్యకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది . ఉచిత లావాదేవీల‌ సంఖ్యను నెలకు 5 నుంచి నెలకు 3 కి తగ్గించింది, కానీ లావాదేవీల ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. అయితే కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త మార్పులను కూడా వెంట‌నే ఉపసంహరించుకుంది. అంతేకాకుండా, ఇతర పీఎస్‌బీ ఇటీవల ఇలాంటి ఛార్జీలను పెంచలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, పీఎస్‌బీ‌లతో సహా అన్ని బ్యాంకులు తమ సేవలకు సరసమైన, పారదర్శకంగా, వివక్షత లేని రీతిలో ఛార్జీలు, ఖర్చుల ఆధారంగా వసూలు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ తాము పెంచడానికి ప్రతిపాదించలేదని తెలియజేస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని సమీప భవిష్యత్తులో బ్యాంక్ ఛార్జీలు పెంచబోమ‌ని పీఎస్‌బీలు తెలియజేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని