క‌నీస బ్యాలెన్స్ లేక‌పోతే ఫైన్ క‌ట్టాల్సిందే..

పోస్టాఫీసు పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రని త‌పాలాశాఖ‌ పేర్కొంది. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌ ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న ప్ర‌తీఒక్క‌రూ రూ.500 నెల‌వారీ...

Updated : 18 Dec 2020 13:07 IST

పోస్టాఫీసు పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రని త‌పాలాశాఖ‌ పేర్కొంది. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌ ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న ప్ర‌తీఒక్క‌రూ రూ.500 నెల‌వారీ స‌గ‌టు బ్యాలెన్స్‌ను క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. డిసెంబ‌రు 11,2020 నాటికి పొదుపు ఖాతాలో క‌నీస బ్యాలెన్స్ ఉండాల‌ని, ఒక‌వేళ లేన‌ట్ల‌యితే రూ.100+జీఎస్‌టీ ఖాతా నుంచి డిడ‌క్ట్ అవుతుంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం పోస్టాఫీసు పొదుపు ఖాతాపై వార్షింగా 4 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. కనీసం రూ.500ల‌తో ఖాతాను తెరవ‌వ‌చ్చు.

పోస్టాఫీసు పొదుపు ఖాతా గురించిన 10 ముఖ్య‌మైన అంశాలు:

  1. క‌నీస డిపాజిట్ మొత్తం : రూ. 500 ( త‌రువాత నుంచి రూ.10 త‌క్కువ కాకుండా జ‌మ చేసుకోవ‌చ్చు.
  2. క‌నీస విత్‌డ్రా మొత్తం : రూ.50
  3. గ‌రిష్ట డిపాజిట్ : ప‌రిమితి లేదు. ఎంతైనా డిపాజిట్ చేసుకోవ‌చ్చు.
  4. క‌నీస బ్యాలెన్స్ : రూ.500 ( ఖాతాలో రూ.500 మాత్ర‌మే ఉంటే విత్‌డ్రాల‌ను అనుమ‌తించ‌రు.)
  5. ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే నాటికి ఖాతాలో రూ.500 మించి బ్యాలెన్స్ లేక‌పోతే ఖాతా నిర్వ‌హ‌ణ రుస‌ము కింద ఖాతా నుంచి రూ.100 డిడ‌క్ట్ చేస్తారు. ఒక‌వేళ ఖాతా జిరో బ్యాలెన్స్ స్థితికి చేరుకుంటే అటువంటి ఖాతాల‌ను ర‌ద్దు చేస్తారు.
  6. ప్ర‌తీ నెల 10 తేది మొద‌లుకుని నెల చివ‌రి తేదికి ఖాతాలో ఉన్న క‌నీస బ్యాలెన్స్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వ‌డ్డీ లెక్కిస్తారు.
  7. ఒక నెల‌లో 10 తేది నుంచి నెల చివ‌రి తేది మ‌ధ్య‌లో రూ.500 కంటే త‌క్కువ బ్యాలెన్స్ ఉంటే ఎటువంటి వ‌డ్డీ చెల్లించ‌రు.
  8. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన వడ్డీ రేటు అనుస‌రించి వడ్డీ ఖాతాలో జమ అవుతుంది.
  9. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80టిటిఏ ప్ర‌కారం, అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాల‌లో జ‌మ చేసిన మొత్తంపై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం రూ.10వేల మించ‌క‌పోతే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.
  10. ఒక ఖాతాలో వ‌రుస‌గా మూడు సంవ‌త్స‌రాల పాటు ఎటువంటి లావాదేవీలు(డిపాజిట్‌/ విత్‌డ్రా) లేక‌పోతే అటువంటి ఖాతాను నిద్రాణ‌మైనదిగా ప‌రిగ‌ణిస్తారు. సంబంధిత త‌పాలా కార్యాల‌యంలో తాజా కేవైసీ ప‌త్రాల‌తో పాటు పాస్‌బుక్‌ను ఇచ్చి ఖాతాను తిరిగి పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని