నోషనల్ రెంట్ ఎలా లెక్కిస్తారు?
నోషనల్ రెంట్‌ను ఫెయిర్ రెంట్, మున్సిపల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్ ఆధారంగా లెక్కిస్తారు. నోషనల్ రెంట్ అంటే ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద స్థిరాస్తి ద్వారా పొందిన ఆదాయం. ..
నోషనల్ రెంట్‌ను ఫెయిర్ రెంట్, మున్సిపల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్ ఆధారంగా లెక్కిస్తారు. నోషనల్ రెంట్ అంటే ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద స్థిరాస్తి ద్వారా పొందిన ఆదాయం. నిజానికి ప్రాపర్టీపై ఎటువంటి ఆదాయం మీరు పొందకపోయినా పన్ను లెక్కిస్తారు. ఇది ఇంటిని అద్దెకిచ్చేవారికి కొంత నిరాశపరిచే విషయం. అయితే ఇప్పటివరకు ఒక ఇంటిపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు, రెండవ ఇంటిపై నోషనల్ రెంట్ చెల్లించాల్సి ఉండేది. బడ్జెట్ 2019 లో తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం రెండు ఇళ్లపై పన్నును క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండు కంటే ఎక్కువ ఇళ్లు ఉన్నప్పుడు ఏవైనా రెండు ఇళ్లపై మాత్రమే మినహాయింపు లభిస్తుంది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
పన్ను మినహాయింపు: ప్రాపర్టీ వార్షిక విలువ ఆధారంగా నోషనల్ రెంట్ ఉంటుంది. ఫెయిర్ రెంట్, మున్సిపల్ విలువ, ప్రామాణిక అద్దె ఆధారంగా దీనిని లెక్కిస్తారు. వార్షిక అద్దె నుంచి మున్సిపల్ పన్నులు మినహాయింపు ఉంటుంది.
ఫెయిర్ రెంట్ ఒకే ప్రాంతంలో ఉండే ఒకే రకమైన ప్రాపర్టీపై సంబంధిత మున్సిపల్ అథారిటీ మున్సిపల్ విలువనే అద్దెగా నిర్ణయిస్తుంది. స్టాండర్డ్ రెంట్ అద్దె నియంత్రణ చట్టం కింద ఫిక్స్డగా ఉంటుది. దీని ప్రకారం పరిమితికి మించి ఎక్కువ అద్దె వసూలు చేసేందుకు వీలుండదు.
ఉదాహరణకు, ఒక అపార్ట్మెంట్ వార్షిక ఫెయిర్ రెంట్ రూ.2.40 లక్షలు అనుకుంటే, మున్సిపల్ విలువ రూ.1.80 లక్షలు, ప్రామాణిక అద్దె రూ.3 లక్షలు. అద్దెను అంచనా వేసేందుకు ఫెయిర్ రెంట్, మున్సిపల్ విలువను ఏది ఎక్కువగా ఉంటే అది పరిగణనలోకి తీసుకుంటారు. ఆ రెండింటిలో ఏది ఎక్కువైతే దానిని స్టాండర్డ్ రెంట్‌తో పోల్చినప్పుడు తక్కువగా ఉన్న దానిని ప్రామాణికంగా తీసుకుంటారు. అందువలన ఫెయిర్ రెంట్ రూ.2.40 లక్షలు అద్దె అంచనాగా తీసుకుంటారు. తర్వాత మున్సిపల్ ట్యాక్స్ రూ.20 వేలు మినహాయిపు లభిస్తే, అద్దె రూ.2.20 లక్షలుగా ఉంటుంది.
ఎంత పన్ను చెల్లించాలి?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం నోషనల్ రెంట్ లెక్కించేటప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ 30 శాతం లభిస్తుంది. ఈ మినహాయింపు మీరు ఆస్తుల నిర్వహణ కోసం వెచ్చించిన కారణంగా ఉంటుంది. పైన తెలిపిన ప్రకారం రూ.2.20 లక్షల్లో 30 శాతం అంటే రూ.66 వేలు మినహాయింపు లభిస్తుంది. అంటే సంవత్సరానికి పన్ను కిందకి వచ్చే ఆదాయం రూ.1.54 లక్షలు అవుతుంది.
ప్రాపర్టీకి సంబంధించి రుణం ఉంటే, దీనిపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు లభిస్తుంది. దీంతో చెల్లించాల్సిన మొత్తం మరింత తగ్గుతుంది. ఈ మినహాయింపులు పోగా ప్రాపర్టీపై వచ్చిన ఆదాయం లేదా నష్టంగా పరిగణించి శ్లాబు ప్రకారం పన్ను వర్తింపజేస్తారు. అయితే ప్రాపర్టీపై వచ్చిన నష్టం ఇతర ఆదాయం నుంచి రూ.2 లక్షల వరకు మాత్రమే రద్దు చేసేందుకు అనుమతి ఉంటుంది.
పైన తెలిపిన ఉదాహరణ ప్రకారం, రుణంపై వడ్డీ రూ.5 లక్షలు చెల్లిస్తున్నట్లయితే, నష్టం రూ.3.46 లక్షలు అనుకుంటే రూ.2 లక్షలు మాత్రమే రద్దు అవుతుంది. రూ.1.46 లక్షలు వచ్చే ఎనిమిదేళ్లలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. పన్ను శ్లాబు 20 శాతం అనుకుంటే, ఎటువంటి గృహ రుణం లేకపోతే వార్షిక అద్దె రూ.1.54 లక్షలపై రూ.32,032 (20 శాతం పన్ను, 4 శాతం వైద్య, విద్య సెస్) పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్