ఎన్‌పీఎస్‌పై ఎంత రాబ‌డి వ‌స్తుంది?

ఈ పధకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు భారతీయులు అందరు సభ్యులుగా చేరే అవకాశం ఉంది........

Published : 21 Dec 2020 16:14 IST

ఈ పధకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు భారతీయులు అందరు సభ్యులుగా చేరే అవకాశం ఉంది.

పదవీవిరమణ అనంతర జీవితం కూడా ఎంతో ఆనందంగా , ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. మారుతున్న జీవన విధానానికి, జీవన ప్రమాణాలకు సరైన నిధి ఉండాలి. మనకున్న పదవీవిరమణ నిధిని సమకూర్చే పథకాల్లో ఎన్పీఎస్ కూడా ఒకటి. ఇందులో కొంత శాతం ఈక్విటీ లలో , మిగిలింది డెట్ లలో మదుపు చేసే అవకాశం ఉంది. ఎన్పీఎస్ లో మదుపు చేయడం వల్ల మీరు మంచి పదవీ విరమణ నిధి, పెన్షన్ పొందొచ్చు. ఈక్విటీ లలో 50 శాతం వరకు మదుపు చేసే అవకాశం ఉండటం వలన, దీర్ఘకాలంలో 9-10% వరకు రాబడి ఆశించవచ్చు. ప్రస్తుత నియమాల ప్రకారం 60 సం వయసులో, జమ అయిన నిధి నుంచి పన్ను మినహాయింపు తో 60 శాతం నిధిని పొందవచ్చు. మిగిలిన 40 శాతం ద్వారా పెన్షన్ పొందవచ్చు. ఇందులో సెక్షన్ 80సి కాకుండా సెక్షన్ 80సిసిడి (1బి) కింద అదనంగా రూ. 50 వేలు పన్ను ఆదా చేసుకోవచ్చు.

ఈ పధకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు భారతీయులు అందరు సభ్యులుగా చేరే అవకాశం ఉంది.
ఈ కింది పట్టిక ద్వారా దీని రాబడి ఎంత ఉందొ చూద్దాం:

nps.jpg

స్వల్పకాలంలో మార్కెట్ లు హెచ్చుతగ్గులకు గురిఅవుతుంటాయి . అంటే ఒక ఏడాది అధిక రాబడి రావచ్చు, మరొక ఏడాది నష్టాలూ ఉండొచ్చు. వీటిని పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. ఫై పట్టికలో చూసినట్టయితే ఒక ఏడాది రాబడి కంటే , మూడు ఏళ్ల, ఐదు ఏళ్ల రాబడి తగ్గినట్లు కనిపిస్తుంది. ఇది మార్కెట్ల స్వభావం . ఈక్విటీ, డెట్ లలో కలిపి మదుపు చేస్తుంది కాబట్టి సగటున 9-10 శాతం వరకు రాబడి అంచనా వేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని