Okinawa Autotech: ఒకినావా ఆటోటెక్‌ వాహనాల్లో 100% దేశీయ పరికరాలు!

విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒకినావా ఆటోటెక్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆఖరు నాటికి తమ కంపెనీలో తయారయ్యే వాహనాల్లో పూర్తిగా దేశీయ పరికరాలనే వినియోగిస్తామని ప్రకటించింది.....

Published : 06 Oct 2021 21:32 IST

ముంబయి: విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒకినావా ఆటోటెక్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆఖరు నాటికి తమ కంపెనీలో తయారయ్యే వాహనాల్లో పూర్తిగా దేశీయ పరికరాలనే వినియోగిస్తామని ప్రకటించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమానికి కట్టుబడే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. దీంతో పూర్తిగా 100 శాతం దేశీయ వాహన తయారీ కంపెనీగా తమ సంస్థ రూపాంతరం చెందబోతోందని తెలిపింది. దీనివల్ల తమ ఉత్పత్తులపై వినియోగదారులకు విశ్వాసం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

రాజస్థాన్‌లోని భివాడీ ప్రాంతంలో తమ కొత్త తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని తెలిపింది. దీని కోసం రూ.200-250 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొంది. రానున్న రోజుల్లో విద్యుత్తు ద్విచక్రవాహనాల డిమాండ్‌కు అనుగుణంగా దీన్ని నిర్మిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం తాము తయారుచేస్తున్న వాహనాల్లో 92 శాతం పరికరాలు దేశీయంగా తయారు చేస్తున్నవేనని కంపెనీ వ్యవస్థాపకులు, ఎండీ జితేందర్‌ శర్మ తెలిపారు. దీన్ని ఈ ఏడాది చివరి నాటికి 100 శాతంగా మారుస్తామన్నారు. అందుకోసం స్థానిక పరికరాల సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఒకినావా నుంచి ప్రస్తుతం ఆరు విద్యుత్తు స్కూటర్లు విపణిలోకి విడుదలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని