Ola Scooter: ఓలా స్కూటర్‌ విడుదల తేదీని ప్రకటించిన భవీష్!

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల తేదీని సంస్థ సీఈఓ భవీష్‌ అగర్వాత్‌ మంగళవారం ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న స్కూటర్‌ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.....

Updated : 30 Aug 2022 11:17 IST

దిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల తేదీని సంస్థ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ మంగళవారం ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న స్కూటర్‌ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. స్కూటర్‌ ఫీచర్లు, బుక్‌ చేసుకున్న వారికి ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.. వంటి వివరాలు ఆరోజే ప్రకటిస్తామన్నారు.

జులై 15న ఓలా స్కూటర్‌ బుకింగ్‌లు ప్రారంభమైన విషయం తెలిసిందే. రూ.499లతో బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. తొలి 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్‌లు అందాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్‌లో తయారు చేస్తున్న ఈ స్కూటర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేగం, ఛార్జింగ్‌, బూట్‌ స్పేస్ విషయంలో ఈ విభాగంలో ఇదే అత్యుత్తమైనదిగా నిలిచే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 10 రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఆ రంగులను ఇటీవలే కంపెనీ బహిర్గతం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని