Ola Electric: ఈ మోటార్‌ సైకిళ్లపై ఓలా దృష్టి..!

ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ ఇప్పుడు ఈ-మోటార్‌ సైకిళ్లపై దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవేష్‌ అగర్వాల్‌ ధ్రువీకరించారు. వచ్చే ఏడాది నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లు,

Updated : 30 Aug 2022 11:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ ఇప్పుడు ఈ-మోటార్‌ సైకిళ్లపై దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవేష్‌ అగర్వాల్‌ ధ్రువీకరించారు. వచ్చే ఏడాది నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లు, చౌకగా స్కూటర్ల అభివృద్ధిపై దృష్టిపెట్టనున్నట్లు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించిన ఒక ఆర్టికల్‌ను రీట్వీట్‌ చేస్తూ ‘యస్‌ నెక్స్ట్‌ ఇయర్‌’ అని పేర్కొన్నారు. గతంలో ఆయన తన బ్లాగ్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ కంపెనీ ఉత్పత్తులను ఈ-మోటార్‌ సైకిళ్ల నుంచి ఈ-కార్ల వరకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ 200 మిలియన్‌ డాలర్లను సమీకరించింది. వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయడం, ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టడం వంటివి చేస్తోంది. ‘మిషన్‌ ఎలక్ట్రిక్‌’ను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిధులను సమీకరించినట్లు భవేష్‌ పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆగస్టులో ఓలా సంస్థ ఎస్‌1, ఎస్‌1ప్రో వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ఈ సంస్థ వాహనాలను టెస్ట్‌డ్రైవ్‌ల కోసం వినియోగదారులకు  అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఈ వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టనుంది. డిసెంబర్‌లో రెండో విడత విక్రయాలను చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని