ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన కర్మాగారం

 భారత్‌ను విద్యుత్తు వాహనాల తయారీ హబ్‌గా చేయాలనే లక్ష్యంతో తమిళనాడులో విద్యుత్త ద్విచక్ర వాహన తయారీ హబ్‌ ఏర్పాటు చేస్తు్నట్లు ఓలా ప్రకటించింది. ఈమేరకు తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకొంది.  ఇది ప్రపంచలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన

Published : 30 Dec 2020 15:59 IST

* తమిళనాడులో నిర్మించనున్న ఓలా
* రూ.2,400 కోట్ల పెట్టుబడి

ఇంటర్నెట్‌డెస్క్‌:  భారత్‌ను విద్యుత్తు వాహనాల తయారీ హబ్‌గా చేయాలనే లక్ష్యంతో తమిళనాడులో విద్యుత్త ద్విచక్ర వాహన తయారీ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. ఈమేరకు తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకొంది.  ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కేంద్రంగా నిలవనుందని పేర్కొంది. ఇది ఏటా 20 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించింది. ఇక్కడ దాదాపు 10వేల మందికి ఉద్యోగాలు లభించవచ్చని పేర్కొంది. దీంతో త్వరలోనే విద్యుత్తు వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చే ప్రణాళికను ఓలా వేగవంతం చేసినట్లు అయింది. 

దీనిపై కంపెనీ ఛైర్మన్‌, సీఈవో భవేష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది ఓలాకు కీలకమైన మైలు రాయి. ప్రపంచంలోనే అత్యాధునిక తయారీ కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. భారత్‌ ప్రపంచ స్థాయి ఉత్పత్తలను తయారు చేయగలదని ఇది నిరూపిస్తుంది’’ అని పేర్కొన్నారు. 

ఈ ప్లాంట్‌లో తయారయ్యే ఉత్పత్తులను భారత్‌ సహా ఐరోపా, ఆసియా, లాటిన్‌ అమెరికా వంటి  మార్కెట్లలో విక్రయించేలా ఓలా ప్రణాళిక సిద్ధం చేసింది. తన ఎలక్ట్రానిక్‌ వ్యాపారం అవసరాల మేరకు 2,000 మందిని నియమించుకోవాలని ఓలా ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసింది. 

ఇవీ చదవండి

విదేశీ కంపెనీల్లో డ్రాగన్‌ ఊడలు..!

ఫ్యాక్టరీ వద్ద ఘర్షణలపై యాపిల్‌ దర్యాప్తు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని