సుక‌న్య స‌మృద్ధి ఖాతాలో ఆన్‌లైన్ డిపాజిట్‌లు

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) యాప్‌లో ఆన్‌లైన్‌లో ద్వారా దీనిని నిర్వహించవచ్చు

Published : 11 Jan 2021 16:44 IST

ఆడపిల్లలున్న త‌ల్లి లేదా తండ్రి పన్ను-పొదుపు పెట్టుబడులను ఎన్నుకునేటప్పుడు సుకన్య సమృద్ది ఖాతా (ఎస్‌ఎస్‌ఏ) ను ఎంచుకుంటారు. జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయ‌లేదు.  చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సవరిస్తారు. సుక‌న్య స‌మృద్ధి ఖాతా తెరిచిన తరువాత, మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) యాప్‌లో ఆన్‌లైన్‌లో ద్వారా దీనిని నిర్వహించవచ్చు.

 ఐపీపీబీ ద్వారా సుక‌న్య స‌మృద్ధి ఖాతాలోకి డ‌బ్బు బ‌దిలీ చేసే విధానం:
1) మీ బ్యాంక్ ఖాతా నుంచి ఐపీపీబీ ఖాతాలోకి న‌గ‌దు పంపించాలి2) అక్క‌డ‌ DOP Products లో సుకన్య‌ సమృధి ఖాతాను ఎంచుకోండి.3) మీ ఎస్ఎస్‌వై ఖాతా  సంఖ్య‌,  డీపీఓపీ క‌స్ట‌మ‌ర్ ఐడీని ఎంట‌ర్ చేయాలి4) వాయిదాల వ్యవధి , మొత్తాన్ని ఎంచుకోండి.
5) ఐపీపీబీ మొబైల్ అప్లికేషన్ ద్వారా విజయవంతంగా చెల్లింపు బదిలీ  తెలియజేస్తుంది.
6) మీరు ఇండియా పోస్ట్ అందించే వివిధ పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి ఆప్ష‌న్ల‌ను ఇస్తుంది. ఐపీపీబీ ప్రాథమిక పొదుపు ఖాతా ద్వారా క్రమం తప్పకుండా చెల్లింపులు చేయవచ్చు.

 సుక‌న్య స‌మృద్ధి తాజా వడ్డీ రేట్లు:
ఎస్‌ఎస్‌వైపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి త్రైమాసికంలో రేటును స‌వ‌రిస్తుంది. సుకన్య సమృద్ది ఖాతాలో కనీస పెట్టుబడి ఆర్థిక సంవత్సరానికి రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షలు. ఈ ఖాతా మెచ్యూరిటీ గ‌డువు 21 సంవ‌త్సరాలు లేదా పిల్లల వివాహం సమయంలో తీసుకోవ‌చ్చు. ప్రస్తుత వడ్డీ రేటు 7.6 శాతం

డాక్‌పే (DakPay)  డిజిటల్ చెల్లింపుల యాప్‌:

గత నెలలో ప్రభుత్వం డాక్ పే డిజిటల్ చెల్లింపుల యాప్‌ను విడుదల చేసింది. దీన్ని పోస్ట్ ఆఫీస్, ఐపిపిబి కస్టమర్లు కూడా ఉపయోగించవచ్చు. ఇండియా పోస్ట్‌ ఐపిపిబి అందించే డిజిటల్ ఫైనాన్షియల్, సంబంధిత‌ బ్యాంకింగ్ సేవలను డాక్ పే అందిస్తుంది. డ‌బ్బును బ‌దిలీ చేసేందుకు, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం, సేవలు , వ్యాపారులకు డిజిటల్‌గా చెల్లింపు వంటి సేవలను సులభతరం చేస్తుంది. ఇది దేశంలోని ఏ బ్యాంకుతోనైనా వినియోగదారులకు ఈ డిజిట‌ల్ సేవలను అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు