Online food delivery: జీఎస్‌టీ పరిధిలోకి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు!

ఆన్‌లైన్‌లో తరచూ ఆర్డర్‌ చేసే ఆహార ప్రియులకు ఓ చేదు వార్త. ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్స్‌ జోమాటో, స్విగ్గీ తమ సేవలను త్వరలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కిందకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి....

Published : 15 Sep 2021 17:52 IST

దిల్లీ: ఆన్‌లైన్‌లో తరచూ ఆర్డర్‌ చేసే ఆహార ప్రియులకు ఓ చేదు వార్త. ఫుడ్‌ డెలివరీ ఫ్లాట్‌ఫామ్స్‌ జోమాటో, స్విగ్గీ తమ సేవలను త్వరలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కిందకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం (సెప్టెంబరు 17) జరిగే జీఎస్‌టీ సమావేశాల్లో ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. జీఎస్‌టీ కౌన్సిల్‌లోని ఫిట్‌మెంట్‌ కమిటీ ఇచ్చిన సూచనలపై సమావేశాల్లో చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెస్టారెంట్లు అందించే సేవలతో పాటు డోర్‌ డెలీవరీ, టేక్‌అవే, ఫుడ్‌ సర్వ్‌ చేయడం వంటి వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని కమిటీ సూచించింది. దీనిపై కమిటీ రెండు ప్రతిపాదనలు తీసుకువచ్చింది.

మొదటిది: యాప్‌ ఆధారిత ఇ-కామర్స్‌ ఆపరేటర్ల (ECO)ను ‘డీమ్డ్‌ సప్లయర్స్’గా గుర్తిస్తూ రెండు కేటగిరీలుగా విభజించింది. ఇన్‌పుట్ క్రెడిట్ లేకుండా 5 శాతం, ఇన్‌పుట్ క్రెడిట్‌తో 18 శాతం పన్ను రేటుతో రెస్టారెంట్‌ నుంచి ఇకోకు పన్ను విధించడం. ఇకో నుంచి కస్టమర్‌కు 5 శాతం పరిమిత ఇన్‌పుట్ పన్ను క్రెడిట్‌ను విధించడం.

రెండవది: రెండో ప్రతిపాదనలో ఇకోలను అగ్రిగేటర్లుగా గుర్తించి తర్వాత రేట్‌ను ఫిక్స్‌ చేయడం. దీనివల్ల రెస్టారెంట్‌ అందించే అన్ని సేవలకు ఇకోలే జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ పన్ను విధానం రూ.7,500 కంటే ఎక్కువ టారిఫ్‌లు ఉన్న హోటళ్లకు, రెస్టారెంట్లకు వర్తించకపోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని