భారత ఈవీ మార్కెట్‌పై ఒప్పో కన్ను.. కారు తెచ్చేందుకు సన్నాహాలు!

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో సైతం ఎలక్ట్రిక్‌ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోందని, 2024 నాటికి దీన్ని తీసుకురావాలని యోచిస్తోందని తెలుస్తోంది.

Published : 22 Nov 2021 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) మార్కెట్‌ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే వివిధ కంపెనీలు భారత్‌లో ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ జాబితాలో పలు స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలూ ఉన్నాయని తెలుస్తోంది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో సైతం ఎలక్ట్రిక్‌ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోందని, 2024 నాటికి దీన్ని తీసుకురావాలని యోచిస్తోందని తెలుస్తోంది.

ఇప్పటికే చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్‌ కంపెనీలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు 91 మొబైల్స్‌ నివేదిక పేర్కొంది. తొలుత ఒప్పో నుంచి 2024 తొలినాళ్లలో అర్ధభాగంంలో ఓ ఎలక్ట్రిక్‌ వాహనం రానుందట. అయితే, దీనిపై ఆయా కంపెనీలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. భారత్‌లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడం.. ఆయా కంపెనీల దృష్టి భారత్‌పై పడింది. మరోవైపు సంప్రదాయ కార్ల తయారీ కంపెనీలే కాకుండా.. ఇతర రంగాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలూ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. యాపిల్‌, గూగుల్‌, హువావే, షావోమి వంటివి ఇప్పటికే ఈ వాహనాల తయారీలో నిమగ్నమై ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని