బడ్జెట్‌ ప్రవేశపెడుతుండగా రైతు మద్దతు నినాదాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా కొందరు

Updated : 01 Feb 2021 12:41 IST



దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా కొందరు ఎంపీలు రైతులకు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టిన రైతన్నలకు మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు జస్బీర్‌సింగ్‌ గిల్‌, గుర్జీత్‌సింగ్‌ ఔజ్లా లోక్‌సభకు నల్ల కోర్టులు ధరించి వచ్చారు. ఆర్థిక మంత్రి ప్రసంగాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే వారితోపాటు మరికొందరు ఎంపీలు అన్నదాతలకు మద్దతుగా నినాదాలు ప్రారంభించారు. సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నంతసేపూ వారి నినాదాలు కొనసాగాయి.

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట

నిర్మలమ్మ హామీలతో దూసుకెళ్తున్న మార్కెట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని