Oracle - Airtel: ఎయిర్‌టెల్‌తో జట్టుకట్టిన ఒరాకిల్‌‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ క్లౌడ్‌ సేవల సంస్థ ఒరాకిల్‌  భారత్‌లోని ఎయిర్‌టెల్‌ డేటాసెంటర్‌ యూనిట్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని బుధవారం ఒరాకిల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యంత వేగంగా పెరుగుతున్న భారతీయ మార్కెట్లో వినియోగదారులను పెంచుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. ముంబయిలోని ఆర్థిక సేవల సంస్థలతో సహా.. దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్‌లాంటి టెక్‌నగరాల్లో ఎయిర్‌టెల్‌ నెక్స్ట్రాతో కలిసి క్లౌడ్‌ సేవలను విస్తరించేందుకు అవకాశం ఉందని ఒరాకిల్‌ జపాన్‌ అండ్‌ ఆసియా పసిఫిక్‌ అధ్యక్షుడు గార్రెట్‌ ఇల్గ్‌ పేర్కొన్నారు.

‘‘ఎయిర్‌టెల్‌ వంటి కంపెనీకి ఇక్కడ మంచి వినియోగదారుల నెట్‌వర్క్‌ ఉంది. అటువంటి కంపెనీతో జట్టు కట్టడం భారత్‌లో వేగంగా మా వినియోగదారుల సంఖ్యను పెంచుతుంది. తక్కువ రిస్క్‌ ఉండటంతోపాటు మా వినియోగదారులకు వేగంగా నమ్మకం ఏర్పడుతుంది’’ అని గార్రెట్‌ పేర్కొన్నారు. ఈ డీల్‌కు సంబంధించిన ఇతర అంశాలను ఆయన వెల్లడించలేదు. 

ఈ ఒప్పందంతో ఎయిర్‌ టెల్‌కు భారత్‌లో కస్టమర్లుగా ఉన్న దాదాపు 10లక్షల మందికిపైగా వ్యాపారులకు క్లౌడ్‌ సేవలను విక్రయించే అవకాశం ఒరాకిల్‌కు లభించింది. దీంతో భవిష్యత్తులో డిజిటల్‌ సేవలు వినియోగించాలనుకునే లక్షల  వ్యాపారస్తులను కూడా ఆకర్షించవచ్చు. 2025 నాటికి భారత్‌లో క్లౌడ్‌ సేవలపై 12 బిలియన్‌ డాలర్లు వెచ్చించవచ్చని అంచనా.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని