డెబిట్ కార్డ్ సైజ్‌లో ఆధార్‌కార్డ్‌

పీవీపీ ఆధార్‌కార్డ్‌ను ఆన్‌లైన్‌లో రూ.50 చెల్లించ‌డం ద్వారా ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు

Updated : 02 Jan 2021 14:39 IST

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఏఐ), ఆధార్ కార్డ్‌ను పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) కార్డుగా ముద్రించ‌డానికి అనుమ‌తించింది. దీంతో ఇక‌పై ఆధార్ కార్డ్‌ పూర్తిగా కొత్త‌గా ‌ ఎటిఎం లేదా డెబిట్ కార్డుల మాదిరిగానే ఆధార్ కార్డును మీ వాలెట్లలో పెట్టుకునేందుకు వీలుంటుంది. "సరికొత్త భద్రతతో కూడిన ఆధార్ ఇప్పుడు మ‌రింత మ‌న్నికైన‌ది, వాలెట్లో పెట్టుకునేందుకు సౌక‌ర్యంగా, త‌క్ష‌ణ దృవీక‌రణ‌కు వీలుగా ఆఫ్‌లైన్‌లో మీకు అందుబాటులో ఉండే గుర్తింపుకార్డుగా ఉండ‌నుంది. రూ.50 చెల్లించి ఈ కొత్త పీవీసీ ఆధార్ కార్డును పొంద‌వ‌చ్చు.

https://t.co/bzeFtgsIvR ఈ లింక్‌పై క్లిక్ చేయ‌డం ద్వారా ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు.

ఆధార్ పీవీసీ కార్డు కొత్త ఫీచ‌ర్స్ :

  1. మంచి ప్రింటింగ్ నాణ్యత, లామినేషన్
  2. ఆధార్ పివిసి కార్డు మరింత మన్నికైనది, ఎక్క‌డికైనా తీసుకువెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుంది
  3. సరికొత్త ఆధార్ పివిసి కార్డు సరికొత్త భద్రతా లక్షణాలను కలిగి ఉంది.
  4. ఆధార్ పివిసి కార్డ్ పూర్తిగా సుర‌క్షితం, ఎక్క‌డికైన‌తా తీసుకెళ్లేందుకు వీలుండ‌టంతో పాటు వాట‌ర్‌-ప్రూఫ్ కూడా ఉంటుంద‌ని తెలిపింది.
  5. QR కోడ్ ద్వారా తక్షణ ఆఫ్‌లైన్ ధృవీకరణ
  6. ఈ కార్డు ఇష్యూ డేట్ & ప్రింట్ డేట్ కలిగి ఉంటుంది
  7. సరికొత్త ఆధార్ పీవీసీ కార్డులో ఆధార్ లోగో ముద్రించి ఉంటుంది

మొబైల్ నంబ‌ర్ న‌మోదు చేయ‌నివారికి కూడా పీవీసీ కార్డు పొందే అవ‌కాశం:
ఆర్డర్ ఆధార్ కార్డ్ 'అనేది యుఐడిఎఐ ప్రారంభించిన కొత్త సేవ, ఇది ఆధార్ హోల్డర్ నామమాత్రపు ఛార్జీలు (రూ.50) చెల్లించి పీవీసీ కార్డులో వారి ఆధార్ వివరాలను ముద్రించడానికి వీలు కల్పిస్తుంది. న‌మోదిత‌ మొబైల్ నంబర్ లేని నివాసితులు రిజిస్టర్ కాని / ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్ ఉపయోగించి కూడా ఆర్డర్ చేయవచ్చు.

ఆధార్ పీవీసీ కార్డ్ స్టేట‌స్ ట్రాక్ చేయ‌వ‌చ్చు:
ఆధార్ పీవీసీ కార్డు స్టేట‌స్‌ను www.uidai.gov.in లో ‘My Aadhaar’ ట్యాబ్‌లో ట్రాక్ చేయవచ్చు. దర‌ఖాస్తు చేసిన ఐదు రోజుల త‌ర్వాత మీ పీవీసీ కార్డు పోస్టాఫీస్‌ల‌కు చేరుతుంది. అక్క‌డినుంచి స్పీడ్ పోస్ట్‌లో మీ చిరునామాకు వ‌స్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని