Income tax returns: 3 కోట్ల ఐటీ రిటర్న్స్‌ దాఖలు: కేంద్రం

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి ఇప్పటి వరకు 3 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

Published : 05 Dec 2021 18:47 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి ఇప్పటి వరకు 3 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇప్పటి వరకు రిటర్నులు దాఖలు చేయని వారు వీలైనంత తొందరగా చేసుకోవాలని సూచించింది. 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఉంది. రోజుకు 4 లక్షల రిటర్నులు దాఖలవుతున్నాయని, చివరి నిమిషయంలో గందరగోళం ఏర్పడకుండా పన్ను చెల్లింపుదారులు వీలైనంత తొందరగా రిటర్నులు దాఖలు చేయాలని ఆర్థిక శాఖ కోరింది. ఈ మేరకు పన్ను చెల్లింపుదారులకు ఈ-మెయిల్స్‌, ఎస్సెమ్మెస్‌, మీడియా ద్వారా సమాచారం చేరవేస్తోంది.

ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఫారం 26 ఏఎస్‌, యాన్యువల్‌ ఇన్ఫర్మేన్‌ స్టేట్‌మెంట్‌ (ఏఐఎస్), ఇతర పత్రాలను తప్పకుండా సరి చూసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. మొత్తంగా దాఖలైన ఐటీ రిటర్నుల్లో 52 శాతం పోర్టల్‌లోని ఆన్‌లైన్‌ ఐటీఆర్‌ ఫారంను ఉపయోగించి చేశారని, మిగిలినవి ఆఫ్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ యుటిలిటీ ద్వారా రూపొందించిన ఐటీఆర్‌ ఫారాలను ఉపయోగించారని పేర్కొంది. రిఫండ్స్‌ కోసం పాన్‌తో లింక్‌ అయిన బ్యాంక్‌ ఖాతానే ఇవ్వాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని