IT Returns: 4.51 కోట్లకు పైగా ఐటీ రిటర్నుల దాఖలు

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబరు 26 వరకు 4.51 కోట్లకు పైగా ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది....

Updated : 27 Dec 2021 18:51 IST

ముంబయి: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబరు 26 వరకు 4.51 కోట్లకు పైగా ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 8,77,721 ఐటీఆర్‌లు దాఖలైనట్లు పేర్కొంది. ఈనెల 31 వరకు వీటి సమర్పణకు గడువు ఉందని తెలిపింది. ఇప్పటి వరకు సమర్పించిన 4.51 కోట్ల ఐటీఆర్‌లలో ఐటీఆర్‌-1లు 2.44 కోట్లు, ఐటీఆర్‌-4లు 1.12 కోట్లు ఉన్నాయని పేర్కొంది. చిన్న, మధ్యస్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్‌ ఫారం 1 (సహజ్‌), ఐటీఆర్‌ ఫారం 4 (సుగమ్‌) ఉన్న విషయం తెలిసిందే. వేతనం, ఒక ఇళ్లు సహా ఇతర ఆదాయ మార్గాల ద్వారా రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు సహజ్‌ను సమర్పిస్తారు. ఇక ఐటీఆర్‌-4ను రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు సమర్పిస్తాయి. క్రితం ఆర్థిక సంవత్సంలో మొత్తం 5.95 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని