OYO IPO: వచ్చే వారం ఓయో ఐపీవో దరఖాస్తు!

ఆతిథ్య రంగ స్టార్టప్‌ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ఐపీవోకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. వచ్చేవారం ఈ కంపెనీ ఐపీవోకు సంబంధించిన ఫైల్‌ను నియాంత్రణ సంస్థకు సమర్పించనున్నట్లు

Updated : 23 Sep 2021 20:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆతిథ్య రంగ స్టార్టప్‌ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ఐపీవోకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. వచ్చేవారం ఈ కంపెనీ ఐపీవోకు సంబంధించిన ఫైల్‌ను నియంత్రణ సంస్థకు సమర్పించనున్నట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఈ ఐపీవో విలువ  బిలియన్‌ డాలర్ల నుంచి 1.2 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనావేశారు. ప్రస్తుతం ఓయోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకుకు 46శాతం వాటాలు ఉన్నాయి. ఓయోపై కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది. దీంతో నెలల కొద్దీ ఉద్యోగులకు లేఆఫ్‌లు, వ్యయ నియంత్రణ చర్యలు, నష్టాలను తట్టుకొని నిలబడింది. తాజాగా సంస్థ కోలుకొని కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముందునాటి పరిస్థితికి చేరుకొంది. 

గత వారం ఓయోలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ 5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, జేపీ మోర్గాన్‌, సిటీబ్యాంక్‌లు ఓయోకు ఐపీవో సలహాదారులుగా ఉన్నాయి. ఇప్పటికే మరో దిగ్గజ స్టార్టప్‌ జొమాటో ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే పేటీఎం,న్యాకా, ఓలా స్టార్టప్‌లు కూడా ఐపీవోకు రంగం సిద్ధం చేసుకొంటున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని