PAN Card: పాన్ కార్డు ఏయే సందర్భాల్లో అవసరం!

భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన వారందరు, మైనర్లు, విదేశీయులు కూడా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు  

Updated : 23 Jan 2022 19:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పన్ను చెల్లింపుదారులకు లేదా ఆదాయపు పన్ను మదింపుదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా ప‌ది అంకెల సంఖ్య‌ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన వారందరూ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మైనర్, విదేశీయులకు పాన్‌ కార్డు అవసరమే.

ప‌న్ను చెల్లింపుదారుల వివ‌రాలు, టీడీఎస్‌, టీసీఎస్ క్రెడిట్స్‌, ఆదాయం, లావాదేవీలు వంటివి పాన్ ద్వారా ఆదాయ ప‌న్ను శాఖ ట్రాక్ చేస్తుంది. ఇది మీ సమాచారాన్ని సులభంగా తిరిగి పొందటానికి, వివిధ పెట్టుబడులు, రుణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలను గురించి తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

పాన్ కార్డ్ ఎప్పుడు అవ‌స‌రం?

  • ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించేందుకు లేదా ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేసేందుకు అవ‌స‌రం.
  • వ్యాపారం లేదా వృత్తి ద్వారా వ‌చ్చే ఆదాయం ₹5 ల‌క్ష‌లు దాటితే పాన్ అవ‌స‌రం.
  • కారు అమ్మడం లేదా కొనేటప్పుడు పాన్‌ ఉండాల్సిందే.
  • బ్యాంక్ ఖాతా లేదా డీమాట్ ఖాతా తెరిచేటప్పుడు అవసరం. 
  • డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించాలి.
  • హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు ₹50,000 కంటే ఎక్కువ నగదు చెల్లించేటప్పుడు పాన్‌ అవసరం.
  • విదేశీ కరెన్సీ లేదా మ్యూచువల్ కొనుగోలు చేసేటప్పుడు పాన్‌ ఉండాలి.

పాన్‌కు బ‌దులుగా ఆధార్‌

సెప్టెంబ‌ర్ 2019 నుంచి ఆదాయ ప‌న్ను శాఖ పాన్‌కు బ‌దులుగా ఆధార్ ప్ర‌త్యామ్నాయాన్ని తీసుకొచ్చింది. ఒక‌వేళ మీకు పాన్ లేక‌పోతే ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌కు ఆధార్‌ను ఇవ్వొచ్చు. అప్పుడు ఆటోమేటిక్‌గా వారికి పాన్ ల‌భిస్తుంది. అంతేకాకుండా పాన్ అవ‌స‌ర‌మైన చోట ఎక్క‌డైనా ఆధార్ ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే దీనికి పాన్‌-ఆధార్ అనుసంధానం చేసి ఉండాల‌న్న సంగ‌తి మరచపోవద్దు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని