రూ.50 తో పాన్ కార్డ్ రీప్రింట్
వ్యక్తుల దృవీకరణ అవసరమైన చోట పాన్ కార్డ్ పలు రకాలుగా ఉపయోగపడుతుంది . చిన్నగా సులభంగా ఉండి వాలెట్లో పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి దీనిని అవసరమైన చోట ఉపయోగించవచ్చు. మరి మీ పాన్ కార్ట్ పోయినా లేదా విరిగిపోయినా, పాడైపోయినా … ఆన్లైన్లో ఆర్డర్ చేసి తిరిగి ప్రింట్ చేసుకోవచ్చు...
వ్యక్తుల దృవీకరణ అవసరమైన చోట పాన్ కార్డ్ పలు రకాలుగా ఉపయోగపడుతుంది . చిన్నగా సులభంగా ఉండి వాలెట్లో పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి దీనిని అవసరమైన చోట ఉపయోగించవచ్చు. మరి మీ పాన్ కార్ట్ పోయినా లేదా విరిగిపోయినా, పాడైపోయినా … ఆన్లైన్లో ఆర్డర్ చేసి తిరిగి ప్రింట్ చేసుకోవచ్చు.
ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డును UTITSL లేదా NSDL-TIN ద్వారా జారీ చేస్తుంది. మీరు ఏ ఏజెన్సీ ద్వారా పాన్ కార్డ్ పొందారో దాని ద్వారా ఆన్లైన్లో రీప్రింట్ చేసుకోవచ్చు.
పాన్ కార్ట్ రీప్రింట్ కోసం ఎలా దాఖలు చేయాలి?
ఆన్లైన్లో NSDL లేదా UTITSL వెబ్సైట్లలో పాన్ కార్డ్ రీప్రింట్ కోసం దరఖాస్తు చేయవచ్చు. మీ పాన్ కార్డులో ఎలాంటి మార్పులు అవసరం లేదనుకున్నప్పుడు ఇలా చేయవచ్చు. పాన్ వివరాల్లో మార్పుల కోసం మరో విధానం ఉంది.
ఈ రెండు ఏజెన్సీలు రూ.50 ఛార్జీతో పాన్‌కార్డ్ రీప్రింట్ చేసి ఆదాయ పన్ను రికార్డులో ఉన్న మీ చిరునామాకి పంపిస్తాయి. విదేశాలకు అయితే రూ.959 ఛార్జీలు వర్తిస్తాయి. రీప్రింట్ కోసం దాఖలు చేసేముందు పాన్ కార్డ్ నంబర్, పుట్టిన తేది, ఆధార్ వివరాలను అందించాల్సి ఉంటుంది.
ఈ-పాన్ కార్డ్
సవరించిన ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం, పాన్ కార్డ్, సాఫ్ట్ కాపీ రూపంలో ఉండనవసరం లేదు. ఆదాయపు పన్ను విభాగం జారీ చేసిన పీడీఎఫ్ ఫైల్ పాన్ కార్డు భౌతిక కాపీలతో సమానంగా పరిగణిస్తారు. ఆధార్ కార్డుకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. UTITSL లేదా NSDL-TIN ఆన్లైన్లో పాన్ కార్డ్ జారీ చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు